హెచ్చరికలను జారీ చేసిన ఎన్నికల సంఘం..!

-

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఆటంకం వాటిల్లకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ముఖేష్ కుమార్ మీన చర్యలు చేపట్టారు. జిల్లాల్లో చేపట్టే చర్యలు గురించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల పరిధిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని పరిశీలించారు.

Alliance between TDP-Janasena-BJP parties in AP

రానున్నా ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా శాంతి భద్రతలకు అడ్డంకి కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్న రాత్రి ఒంగోలులో జరిగిన సంఘటనలో ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. టిడిపి మీద దాడికి పాల్పడి గాయపరిచిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని దాడి చేసిన రాజకీయ ప్రతీతులకి మద్దతు ఇస్తూ టిడిపి కార్యకర్తల ఫిర్యాదులను పట్టించుకోకుండా ఉంటున్న ఎస్ఐల మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news