బెండకాయలతో జుట్టుకు ఆరోగ్యం.. ఎలానో తెలుసుకోండి?

-

బెండకాయలు తింటే మెదడు బాగా పనిచేస్తుందని అంటుంటారు. మెదడు చురుగ్గా ఉండడం సంగతి పక్కన పెడితే.. బెండకాయలు తినడం వల్ల జుట్టుకి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. అంతేకాదు.. బెండకాయల నుండి వచ్చే జిగురులాంటి పదార్థాన్ని ఉపయోగించి కేశాలను మృదువుగా చేసుకోవచ్చు.

ప్రస్తుతం బెండకాయలను ఉపయోగించి జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

జుట్టు తేమగా ఉండటానికి:

జుట్టు పొడిబారినట్టుగా ఉంటే ఎవ్వరికీ నచ్చదు. తేమగా ఉంటేనే మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది. అలాంటి జుట్టు మీ సొంతం అవ్వాలంటే బెండకాయలను ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించండి. బెండ ముక్కల్లోని జిగురు నీటిలో కలిసిపోగానే స్టవ్ మీద నుండి తీసివేసి.. ఆ నీటిని వడపోయండి.

ఇప్పుడు జిగురు లాంటి ద్రావణాన్ని జుట్టుకి షాంపూ లాగా మర్దన చేసుకొని కాసేపైన తర్వాత స్నానం చేయండి. దీనివల్ల మీ జుట్టు మృదువుగా ఉండడంతో పాటు తేమగా కనిపిస్తుంది.

రక్తప్రసరణను పెంచే బెండకాయ నూనె:

మార్కెట్లో దొరికే బెండకాయ నూనె తీసుకుని తలమీద రాసుకోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. జుట్టు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తాయి. వారంలో రెండుసార్లు బెండకాయ నూనెను ఉపయోగించవచ్చు.

అంతేకాదు బెండకాయ ముక్కలను కట్ చేసుకుని, ఆల్రెడీ అరటి ఇంకా బాదంపాలతో తయారు చేసుకున్న స్మూతీలో వేసి జ్యూస్ లాగా తయారుచేసి తాగితే.. జుట్టుకు మేలు చేసే ఆయిల్ తలలో ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా జుట్టు తేమగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version