జుట్టు సమస్యలకి చెక్ పెట్టాలంటే పాలకూర తీసుకోండి..!

Join Our Community
follow manalokam on social media

అందమైన మరియు ఒత్తైన జుట్టు పొందడానికి స్త్రీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ప్రతి వారం తప్పకుండా హెయిర్ ప్యాక్ వేసుకోవడం చేస్తారు, మరికొందరు విటమిన్ ఇ లేదా బయోటిన్ సప్లిమెంట్లను కూడా ఉపయోగిస్తారు. జుట్టును బలోపేతం చేయడానికి మరియు దాని పెరుగుదలను పెంచడానికి ఎన్నో ఉత్పత్తులు వాడినా అందరికీ ఫలితం రాదు. ఎందుకంటే జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు వారిలో ఉండవు కనుక.

జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే పాలకూర ఎంతో అవసరం. పాలకూర లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఫోలేట్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి వంటివన్నీ పాలకూరలో లభిస్తాయి. ఈ ఆకు కూర లో ఉండే విటమిన్ ఏ వల్ల గ్రంధులు ఉత్పత్తి చేస్తాయి. దాంతో జుట్టు దృఢంగా మారి పెరుగుతూ ఉంటుంది. కనుక ప్రతి రోజూ ఒక కప్పు పాలకూర తీసుకుంటే విటమిన్-ఏ లోపం రానే రాదు.

పాలకూర లోనే కాదు చిలకడదుంప లోనూ కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక చిలకడదుంప తినడం వల్ల ఒక రోజుకు అవసరమైన విటమిన్ ఏ శరీరానికి లభిస్తుంది. జుట్టు రాలడానికి మరొక కారణం ఐరన్ లోపం. ఆహారం లో ఐరన్ సరిగ్గా తీసుకోవడం ఎంతో అవసరం. పాలకూర తో పాటు తోటకూర, రాగులు నువ్వులు వంటివి తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...