సీఎం చంద్రబాబును కలిసిన నటుడు సోన్ సూద్..!

-

ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త సోనూసూద్  నేడు  అమరావతి లోని  సచివాలయానికి  వెళ్లారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వాని కి సోనూసూద్ ఫౌండేషన్ నాలుగు ‘అంబులెన్స్ లను విరాళంగా
ఇవ్వనున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ ఈ అంబులెన్స్ లను అందించనుంది. ఈ నేపథ్యంలో
నటుడు సోనూసూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును  కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. అంబులెన్స్ లను ప్రభుత్వానికి అప్పగించారు.


అనంతరం నాలుగు అంబులెన్స్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ విషయంలో సోనూసూద్ ఫౌండేషన్ భాగస్వామి అయినందున ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news