పేలు బాధ తగ్గాలంటే తరచుగా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. తలలో ఉండే పేలు మానవుల తల మీద పెరుగుతూ తలలో రక్తాన్ని పీల్చుతాయి. క్రమంగా దురద, జుట్టు రాలి పోవడం, చుండ్రు వంటి సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తలను శుభ్రంగా ఉంచుకోవడం మేలు. పేల చికిత్స కోసం ఔషధపూరిత షాంపూలు, నూనెలు మరియు ఇతర ఉత్పత్తులు ఉంటాయి. వాటిని వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. సహజంగా ఇంట్లోనే పేలు బాధ తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి.
పేల నివారణకు వెల్లుల్లి ఎంతో బాగా పని చేస్తుంది. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు మెత్తగా నూరి దీనికి కొంచెం నిమ్మ రసం కలుపుకుని, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పేలు మొత్తం రాలిపోతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలకు పూసుకుంటే పేలను తొలగించ వచ్చు. అంతే కాకుండా జుట్టు కుదుళ్లకు అవసరమయ్యే శక్తిని కూడా అది అందిస్తుంది.
వేపాకు మెత్తగా నూరి అందులోని రెండు చుక్కలు ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇలా చేసిన గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం కనపడుతుంది.