నల్లమచ్చలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖం మీద ముఖ్యంగా చెంపల మీద, ముక్కు మీద ఇవి కనిపిస్తుంటాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ నల్లమచ్చలు ఏర్పడతాయి. చర్మ రంధ్రాలని తెరుచుకునేలా చేసి, నల్లమచ్చలని దూరం చేసే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా, నీరు
సాధారణంగా ప్రతీ ఒక్కరి వంటగదుల్లో కనిపించే బేకింగ్ సోడా ముఖ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖంపై పూడ్చుకుపోయిన రంధ్రాలని తెర్చుకునేలా చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల నీరు దానికి కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో పెట్టుకోవలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాని వారని రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ సార్లు ప్రయత్నించవద్దు. దానివల్ల చర్మం పొడిగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.
బ్రౌన్ షుగర్, తేనె, నిమ్మరసం
వీటి మిశ్రమం ముక్కుపై ఉండే నల్లమచ్చలని తొలగించడంలో బాగా తోడ్పడుతుంది. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని మిశ్రమాన్ని తయారు చేసి ముకుపై, గడ్డంపై ఉన్న నల్లమచ్చల ప్రదేశాల్లో వృత్తాకార మార్గంలో బాగా మర్దన చేయాలి. ఐదు నిమిషాలు అలా చేసిన తర్వాత కడగాలి.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ ముక్కుపై, గడ్డంపై ఉన్న నల్లమచ్చల భాగాల్లో వర్తించడం ద్వారా వీటిని తొలగించుకునే అవకాశం ఉంది.