పరిశ్రుభ్రంగా మీ గోళ్ళని ఉంచాలంటే ఈ పద్ధతులని పాటించండి..!

-

గోర్లు పెంచుకోవద్దు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి అని మన ఇంట్లో, స్కూల్స్ లో చెబుతూ ఉంటారు. కానీ ఆ మాటలని వినే వాళ్ళు చాలా అరుదు. శుభ్రం గానే ఉన్నాయి కదా..! లాంగ్ నెయిల్స్ బాగుంటాయి నేను కట్ చెయ్యను…. ఇలా ప్రతీ ఒక్కరికి ఎదో ఒక రీజన్ ఉంటుంది. గోళ్లు పెంచుకోవడం లో ఆడవాళ్ళూ మరీ ముందు ఉంటారు.

పెద్ద పెద్ద గోర్లు పెంచడం… షేప్ చేసుకోవడం… రకరకాల నెయిల్ పెయింట్స్ వేసుకోవడం ఇలా అనేక వాటిని చేస్తూ ఉంటారు. చేతుల అందానికి గోర్లే ప్రధాన ఆకర్షణగా భావించి గోర్లని పెంచుకుంటారు.. అలానే నెయిల్ ఆర్ట్ అంటూ కొత్త ఫ్యాషన్ ఒకటి వచ్చింది. దీంతో చాలా మంది దాన్నే ఫాలో అవుతున్నారు. మరి గోర్లు ఉండడం మంచిదేనా…? ఈ విషయం లోకి వస్తే చూడ్డానికి అందం గానే ఉంటుంది. కానీ, ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

పొడవాటి గోర్ల లో వ్యాధికారక క్రిములు, వైరస్‌లు అలా ఉండిపోతాయట. ఎంత సేపు శుభ్రం చేసిన ఇవి త్వరగా వదలవట. ఇలా వైరస్‌లు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే శుభ్రం చేసేందుకు నిమ్మకాయ వాడాలని.. ఇలా చేస్తే గోర్లు శుభ్రం అవుతాయని చెబుతున్నారు. దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి గుర్తుంచుకోండి. కనుక గోర్లని క్లీన్ చేసేటప్పుడు నిమ్మకాయ చెక్కతో శుభ్రం చేసుకుంటే వైరస్‌లు ఏమైనా ఉన్న క్షణాల లో మాయమై పోతాయని నిపుణులు చెబుతన్నారు. కాబట్టి ఇలాంటి చిన్న చిట్కాలు పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news