ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాయామాలను చేస్తున్నారు. బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిజానికి చాలా మంది ముఖం మీద ఎక్కువ కొవ్వు ఉంటుంది. దీంతో పెద్ద పెద్ద బుగ్గలు, డబల్ చిన్ ఉంటాయి.
అయితే ముఖం దగ్గర ఉండే కొవ్వును తగ్గించాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం. ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే ముఖం మీద కొవ్వు పెరగకుండా చూసుకోవచ్చు. అయితే ఈ ఆహార పదార్థాలకు కనుక మీరు దూరంగా ఉంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేద్దాం.
జంక్ ఫుడ్:
జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలానే జంక్ ఫుడ్ వల్ల ముఖం మీద కొవ్వు పెరుగుతుంది. పైగా ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. జంక్ ఫుడ్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖం మీద కొవ్వు బాగా పెంచేస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచిది.
సొయా సాస్:
ఈ మధ్యకాలంలో చాలా వంటల్లో మనం సొయా సాస్ ని వాడుతున్నాము. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల కూడా ముఖం మీద కొవ్వు పెరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా కట్ చేస్తే మంచిది.
రెడ్ మీట్:
మీరు మాంసాహారులైతే రెడ్ మీట్ కూడా తీసుకోవద్దు. రెడ్ మీట్ ను తీసుకోవడం వల్ల ఒబిసిటీ వంటి సమస్యలు వస్తాయి. రెడ్ మీట్ ని తీసుకోవడం వల్ల ముఖం మీద కొవ్వు చేరుతుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. దీనితో ముఖం మీద కొవ్వు ఉండదు.