ఈ విటమిన్స్ ని తీసుకోండి.. అందం రెట్టింపు అవుతుంది..!

-

అందంగా ఉండాలని ఎవరికీ ఉండదు..? ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని వాళ్ళ అందాన్ని రెట్టింపు చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ పోషక పదార్థాలను తీసుకోండి. ఈ పోషక పదార్థాలతో అందం ఆరోగ్యం రెండు మీ సొంతమవుతాయి. మరి ఎటువంటి పోషక పదార్థాలు ని డైట్ లో చేర్చుకుంటే అందంగా మారచ్చు అనేది చూద్దాం.

విటమిన్ ఈ :

విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే అందంగా ఉండడానికి అవుతుంది. దీనినే బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ ని తీసుకోవడం వలన యూవీ కిరణాల నుండి రక్షణ వస్తుంది. సాల్మా, టున వంటి వాటిలో ఇది మనకి లభిస్తుంది.

విటమిన్ ఏ:

క్యారెట్ గుడ్లు వంటి వాటిలో ఇది మనకి లభిస్తుంది. చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో దీనిని ఉపయోగిస్తారు. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకోవడం వలన అందంగా మారడానికి అవుతుంది.

విటమిన్ సి:

విటమిన్ సి కూడా ఆరోగ్యానికి అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ సి వివిధ రకాల పండ్లలో మనకి లభిస్తుంది. చర్మంపై ఉండే నల్ల మచ్చలు ముడతలు మొటిమలు వంటివి కూడా దీనివలన తొలగిపోతాయి.

విటమిన్ కే:

విటమిన్ కే కూడా అందానికి ఆరోగ్యానికి అవసరం. చేపలు గుడ్లలో ఇది మనకి లభిస్తుంది.
విటమిన్ బీ తో కూడా మీ అందరిని రెట్టింపు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుతుంది. విటమిన్ బి 5 విటమిన్ బి12 కలిగిన ఆహార పదార్థాలను కూడా రెగ్యులర్ గా మీరు డైట్ లో చేర్చుకోవడం మంచిది వీటి వలన కూడా మీ అందం రెట్టింపు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version