ద్రాక్షాతో ఈ ఫేస్ ప్యాక్స్..ఆయిలీ స్కిన్ కు చక్కటి పరిష్కారం..!

-

ద్రాక్ష పండ్లు హెల్త్ కు చాలా మంచివి.. పుల్లపుల్లగా తింటానికి కూడా బాగుంటాయి కదా.. ఇంకా దీంతో చేసే జ్యూస్ కూడా చాలామంది ఇష్టంగా తాగుతారు. నార్మల్ గానే పండ్లతో చేసే ఏ ఫేస్ ప్యాక్ అయినా..స్కిన్ కు బాగా పనిచేస్తుంది. బ్లాక్ గ్రేప్స్ తో కూడా ఫేస్ ప్యాక్ మంచి రిజల్ట్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లకు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇంకెందుకు లేట్.. ద్రాక్షాతో ఎన్ని రకాల ఫేస్ ప్యాక్ లు వేసుకోవచ్చో చూద్దామా..!
ఒక గిన్నెలో కొన్ని ద్రాక్ష పళ్లు తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ లా చేసుకోండి. దీనికి చెంచా చొప్పున ముల్తనీ మట్టి, నిమ్మరసం, గులాబీ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగేస్తే చాలు. జిడ్డు పూర్తిగా తొలగి చర్మం తాజాగా , కాంతివంతంగా మారుతుంది.
పొడి చర్మతత్వం ఉన్నవారు రెండు చెంచాల ద్రాక్ష గుజ్జులో చెంచా చొప్పున బొప్పాయి గుజ్జు, తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఉండే తేనె సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి ముఖాన్ని పొడిబారనివ్వకుండా చేస్తుంది.
ముఖంపై జిడ్డు, పేరుకున్న మురికీ పోవాలంటే మూడు చెంచాల ద్రాక్ష పండ్ల గుజ్జులో స్పూను పొదీనా ఆకుల ముద్ద, నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని గులాబీ నీటితో ముఖాన్ని తుడుచుకోవాలి.
చర్మం యవ్వనంగా కనిపించేందుకు రెండు స్పూన్ల ద్రాక్ష గుజ్జులో ఒక స్పూను మీగడ, ఒక స్పూను బియ్యం పిండి, క్యారెట్ రసం వేసి కలుపుకోవాలి. దీన్ని మెత్తగా చేసి ముఖానికి రాసి అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మెరుపును సంతరించుకుంటుంది.
ఒక గిన్నెలో కొ్న్ని ద్రాక్ష పండ్లను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దానికి చెంచా ఆలివ్ అయిల్, అరస్పూన్ పాలు, వంట సోడా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. స్కిన్ మంచి గ్లోయింగ్ వస్తుంది. వంటసోడాను మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఫేస్ ప్యాక్ కు వాడకపోతే..తక్కువగా వేయండి..లేదా అసలు స్కిప్ చేసేసేయండి.
చూశారా..ద్రాక్షతో ఎన్నిరకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చో.. ఈసారి..ఇంట్లో పండినపోయిన బ్లాక్ గ్రేప్స్ ను పారేయకుండా.. ఇలా చేసి చూడండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version