IPL : ఫ్లే ఆఫ్స్ కు చేరిన లక్నో..గంభీర్ ఓవరాక్షన్‌..వీడియో వైరల్

-

ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ పై లక్నో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్‌ వరకూ సాగిన మ్యాచ్‌ లో కేకేఆర్‌ పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్‌ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో వికెట్లు నష్టపోకుండా 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌ కతా 8 వికెట్ల నష్టానికి 208 పరుగుల చేసింది.

మొత్తానికి కేకేఆర్‌ పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో లక్నో ఆటగాళ్ల కంటే ఎక్కువ సెలబ్రేషన్స్‌ చేశారు ఆ జట్టు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌. మ్యాచ్‌ గెలవగానే.. రెచ్చిపోయి.. చప్పట్లతో.. గంతులెశాడు గౌతమ్‌ గంభీర్‌. తానే మ్యాచ్‌ గెలిపించాననే ఫీలింగ్‌ లో.. గ్రౌండ్‌ మొత్తం.. పరుగెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా… నిన్న జరిగిన మ్యాచ్‌ లో కేకేఆర్‌ పై విజయం సాధించి.. నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరింది లక్నో సూపర్‌ గెంట్స్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version