డిసెంబర్ లో ప్రియాంక గాంధీ తెలంగాణకు రాక..? ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ .. కారణం అదేనా..?

-

కాంగ్రెస్ హయాంలో తెలంగాణవచ్చినా.. దాన్ని ఆ ప్రాంత ప్రజలు విశ్వసించలేదు..దీంతో రెండు దఫాలు బీఆర్ఎస్ పట్టం కట్టారు.. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ.. గతేడాది జరిగిన ఎన్నికల్లో అధికార పగ్గాలు దక్కించుకుంది.. ఆ పార్టీకి సాంప్రదాయ ఓటుబ్యాంకుంది..దానికి తోడు గాంధీ కుటుంబం అంటే అభిమానం మెండుగా ఉంది.. ఈ క్రమంలో డిసెంబర్ లో గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు తెలంగాణకు రాబోతున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి..

డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లేకపోతే రాహుల్ గాంధీలతో ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు సైతం పంపింది.. వారు రావడం వీలుకాకపోతే.. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అయినా వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి..

తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ కుటుంబం చేత ఆవిష్కరిస్తే.. తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో.. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారట.. ఇందుకోసమే రాహుల్ గాంధీని లేదంటే ప్రియాంక గాంధీనిని తీసుకురావలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది.. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు..దీంతో ఇప్పుడైనా వస్తారా లేదా అనేది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్న సందేహం..

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరూ రాకపోతే అది ప్రత్యర్దులకు అస్త్రంగా మారుతుందని హస్తం నేతలు ఆందోళనలో ఉన్నారు.. ప్రజల్లో కూడా నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు.. దీంతో రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చైనా.. ఎవరో ఒకరిని విగ్రహావిష్కరణకు తీసుకురావాలని రాష్ట నాయకత్వం పట్టుదలతో ఉంది.. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version