బీజేపీ కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదు : కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్, BRSలా బీజేపీ కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి. మంచి కమిటీ లు ఏర్పాటు కావాలి. తెలంగాణ లో బీజేపీ కి మంచి భవిష్యత్తు ఉందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోడీ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం చేయాలని చెప్పారు. మనం ఉద్యమ రూపకల్పన చేయాల్సి ఉంది. ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ లను ప్రాసెస్ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చాను అని అబద్ధాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి.

ఏడాది అయిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ ను తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళాలి అని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాల పై ఈ డిసెంబర్ 6 న సరూర్ నగర్ స్టేడియం లో బీజేపీ బహిరంగ సభ ఉండనుంది. దీనికి బీజేపీ జాతీయ నేతలు… అమిత్ షా లేక జేపీ నడ్డా హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version