ఈ టీ తాగితే ముఖంపై ముడతలు రావట.. కొరియన్స్ సీక్రెట్..!

-

మనిషన్నాక వయసు పెరగటం కామన్..వయసుతో పాటు చర్మం కూడా మారిపోతుంది. సిక్స్టీన్ లో ఉన్నట్లు సిక్ట్సీస్ లో ఉండలేరు. కానీ మరీ 30-40 ఏళ్లకే చర్మంపై ముడతలు వచ్చేస్తున్నాయి. ఏదో డెబ్భై ఏళ్లు ఉన్నట్లు కనిపిస్తారు. ఇలా చర్మంపై ముడతలు రాకుండా ఉండాలని చాలా క్రీములు వాడుతుంటాం. ఈ సమస్యకు కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ బాగా పనికొస్తాయ్ అట..మనం కొరియన్ డ్రామాస్ లో చూసే ఉంటాం వాళ్లు ఏంత క్యూట్ గా, వైట్ గా ఉంటారో..వాళ్లు ఫేస్ మీద ముడతలు రాకుండా ఉండేందుకు రోజు బార్లీ టీ తాగుతారట. అది మనం కూడా తేలికగానే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ టీ ఎలా చేసుకోవాలో చూద్దాం.

బార్లీ టీ తయారు చేసే విధానం..

1. ఒక కప్పు నీటిని మరిగించండి.
2. అందులో రెండు టేబుల్ స్పూన్ల రోస్టెడ్ బార్లీని కలపాలి.
3. లో ఫ్లేమ్‌లో ఐదు నిమిషాల పాటు నీటిని మరగనివ్వండి.
4. తరువాత స్టవ్ మీద నించి దించి చల్లారాక వడకట్టి ఆ టీని తాగండి

బార్లీ టీ రోజూ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..

1. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ ని ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నించి కాపాడతాయి.
2. ముడతలు త్వరగా రాకుండా చేస్తాయి.
3. ఇందులో ఉండే ఎజిలైక్ యాసిడ్ రొజేషియా, యాక్నే ని రెడ్యూస్ చేస్తుంది.
4. అన్ని రకాల చర్మ సమస్యల నుండీ ఇది చర్మాన్ని కాపాడుతుంది.

దీంతో పాటు కొరియన్ స్కిన్ కేర్ కూడా ఫాలో అయితే మీ ముఖం ఇంకా ప్రకాశ వంతంగా వెలిగిపోతుంది. అది కాస్త పెద్ద ప్రాసెస్ యే. మీరు కూడా వాటిని ఫాలో అవ్వాలనుకుంటే బ్రౌస్ చేయండి. మనకు ఈజీగానే దొరుకుతుంది. ముడతలు వరకు రాకుండా ఉండాలి అంటే మాత్రం ఈ టీనీ రెగ్యులర్ గా తాగండి. దీన్ని తాగటం వల్ల ముడతలే కాదు..శరీరంలో అనవసరంగా ఉండే వాటర్ కూడా పోతుంది. బరువు తగ్గటానికి బాగా పనికొస్తుంది.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఒకవేల ఈ టీ తాగటం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా డాక్టర్లను సంప్రదించండి. ఎందుకంటే.. కొందరికి శరీరానికి మేలు చేసేవి కూడా హానికలిగిస్తుంటాయి. అలాంటి వాళ్లకు అన్నీ పడవు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటే వెంటనే ఆపేసి డాక్టర్ ను సంప్రదించటం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version