ఇంట్లో ఉండే ఇలా ఆన్ లైన్ ద్వారా డబ్బులు సంపాదించొచ్చు…!

-

డబ్బులు సంపాదించాలి అంటే ఆర్ట్, ఆసక్తి ఉండాలి. మీకు వచ్చిన, నచ్చిన వాటిని ఎంచుకొని ఇంట్లో వుండే డబ్బులు సంపాదించొచ్చు. వంద శాతం నిజంగా పని చేయించుకొని డబ్బు ఇచ్చే వైబ్‌సైట్లు ఉన్నాయి. అయితే మంచిగా పే చేసే కొన్ని వెబ్ సైట్ల గురించి ఇప్పుడు చూద్దాం.

ఫ్రీలాన్స్:

ఇంటర్నెట్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇతరత్రా టెక్నికల్ సాఫ్ట్‌వేర్లను ఆపరేట్ చెయ్యగలిగే స్కిల్స్ ఉంటే ఇది మంచి అవకాశం. మీరు ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఈ సైట్ల లో ఎవరైనా ఫ్రీగా రిజిస్టర్ అవ్వొచ్చు.

ఆ తర్వాత పని లేదా ప్రాజెక్టులు ఎంచుకోవాలి. ఆ పని చెయ్యాలనుకునేవారు ఎంత అమౌంట్ ‌కి చేసేదీ చెబుతారు. ఇలా ఈ ప్రాసెస్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకుని పని చెయ్యొచ్చు. ఫ్రీలాన్స్ వర్క్స్ ఇస్తున్న వెబ్‌సైట్లు ఈరోజు చూడండి. ఇలా చాల వెబ్ సైట్లు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ని ఇస్తాయి.

Blogger :

బ్లాగర్ లో కూడా మీకు సంబందించిన, మీకు వచ్చిన ప్రాజెక్ట్ ని ఎంచుకోవాలి. ఇలా మీరు వర్క్ ని ఎంచుకుని మీరు స్టార్ట్ చెయ్యొచ్చు. మీరు అనుకున్నంత అమౌంట్ కి మేనేజర్ సరే అంటే అంత అమౌంట్ మీకు వస్తుంది.

AdSense :

ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి గూగుల్ దీనిని తీసుకొచ్చింది. జీమెయిల్ ద్వారా ఇందులో జాయిన్ అవ్వొచ్చు. అయితే వాళ్ళకి గూగుల్ ఓ యాడ్‌సెన్స్ అకౌంట్ ఐడీ ఇస్తుంది. ఆ తర్వాత సొంత బ్లాగ్ లేదా వెబ్‌సైట్ ఉంటే ఆ వివరాల్ని గూగుల్ యాడ్‌సెన్స్‌ లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది.

నెక్స్ట్ ఎన్ని యాడ్స్ ఇవ్వొచ్చో చూసి ఆ బ్లాగ్‌ లో లేదా వెబ్‌సైట్స్‌లో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఎవరైనా క్లిక్ చేస్తే, క్లిక్కుకి ఇంత అని రేటు కట్టి అమౌంట్ ఇస్తుంది యాడ్‌సెన్స్. ఇలా కూడా డబ్బులు పొందొచ్చు. ఫ్రీగా బ్లాగ్ లేదా వెబ్‌సైట్ ప్రారంభించుకోవచ్చు. యాడ్‌సెన్స్ ద్వారా ఎక్కువ మనీ సంపాదించాలంటే… మీ వెబ్‌సైట్ లేదా బ్లాగ్‌లో మంచి ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఇంట్లో ఉంటే డబ్బులు సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version