బిజినెస్ ఐడియా: ఇంగువ వ్యాపారంతో లాభాలు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక అదిరే బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ కనుక చేస్తే.. నెలకు రూ.లక్షల్లో సంపాదించొచ్చు. ఇక మరి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇంగువ బిజినెస్ ని చేస్తే మంచి లాభాలు వస్తాయి. దీని కోసం మీరు అసఫోటిడా సాగు చేయాలి. ఇక బిజినెస్ ఎలా చెయ్యాలి..?, ఎలా లాభాలు వస్తాయి అనేది చూస్తే..

ఇంగువ సాగు ద్వారా అదిరే రాబడి పొందొచ్చు. అప్ఘనిస్థాన్‌, ఇరాన్, టర్క్‌మెనిస్థాన్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ సాగు చేస్తారు. మార్కెట్ దీని ధర కేజీకి రూ.వేలలో ఉంటుంది. రూ.35 వేల వరకు పలుకుతోంది. మీరు నెలకు 5 కేజీలు విక్రయించినా కూడా మంచి రాబడి పొందొచ్చు.

ఇంగువకి డిమాండ్ కూడా ఎక్కువే. ఆహారంలో వాడతారు. అలానే ఔషధాల ఉత్పత్తి లో కూడా ఇంగువని వినియోగిస్తారు. ఇంకా చాలా ప్రొడక్టుల్లో సువాసన కోసం వాడతారు. విత్తనాలు నాటడం ద్వారా ఇంగువ సాగు చేయాలి. దీని కోసం ఐదేళ్లు పడుతుంది. భారీ స్థాయిలో ఇంగువ సాగు చేయడానికి రూ.5 లక్షలు ఖర్చవుతుంది.

ఇంకా మెషీన్లు కూడా అవసరం. ఇంగువ ధర మార్కెట్‌లో రూ.35 వేల వరకు ఉంటుంది. మీ పెట్టుబడి బట్టి మీ వ్యాపారం ఉంటుంది. మీరు పలు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకో వచ్చు. ఇంకా ఆన్‌లైన్ ద్వారా విక్రయించొచ్చు. ఇలా నెలకి లక్షల్లో సంపాదించచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news