రెస్టారెంట్ లో వంట గదిలో పని చేసే వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. కేవలం ఎక్కువ మంది జనాన్ని డీల్ చేసుకోవడం ఒక ఎత్తయితే రెస్టారెంట్ తాలూక సమస్యలని సాల్వ్ చేసుకోవడం మరో ఎత్తు. నిజంగా ప్రతి ఒక్క విషయం కూడా ఎంతో చాలెంజింగ్ గా ఉంటుంది. అది పబ్లిక్ సెంటర్ కాబట్టి ఎక్కువ మంది జనం తో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కరోనా కారణంగా రెస్టారెంట్స్ అన్నీ మూసుకుని వున్నాయి. దీంతో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు రావడం, ఓవర్ టైం వర్క్ చేయడం లాంటివి చేస్తున్నారు. చాలా మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పని చేసేవాళ్ళు 12 నుండి 14 గంటలు కూడా పని చేస్తున్నారు.
Chipotle employee throws a pair of scissors ✂️ at customer during an argument 😳 @ChipotleTweets #Chipotle explain 😤 pic.twitter.com/Kho7U5T3LE
— Luciano1 (@waynepe17506084) August 13, 2021
ఇటువంటి సందర్భంలో మరింత ఇబ్బందులు కస్టమర్లతో వస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఒక ఫుటేజ్ వైరల్ అవుతోంది. యూఎస్ లో ఒక కస్టమర్ స్టాఫ్ కి కంప్లైంట్ చేయగా కత్తెరని ఆతని మీదకి విసిరేయడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. తాజాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన కస్టమర్ రెస్టారెంట్ లో ఉన్న సర్వీస్ కి అస్సలు ఇంప్రెస్స్ అవ్వలేదు. దీంతో ఆర్డర్ ఆలస్యంగా వస్తుందని కంప్లైంట్ చేసాడు.
అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేయగా అతనికి ఫుడ్ అర గంటపాటు ఆలస్యంగా వచ్చింది దీంతో ఈ సర్వీస్ చూసి కోపంగా కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని సెకండ్ల తర్వాత కత్తెరని అతని మీదకి విసరడం జరిగింది. దీంతో కస్టమర్ నేను పోలీస్ కి ఫిర్యాదు చేస్తాను. ఆమె నా మీదకు విసిరింది అని అరుస్తాడు. ఇలా జరిగిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.