బిజినెస్ ఐడియా: గోధుమ పిండి వ్యాపారంతో అదిరే లాభాలు..!

మీరు ఏదైనా వ్యాపారంని మొదలు పెట్టాలనుకుంటున్నారు…? ఆ వ్యాపారాన్ని చేసి మంచిగా లాభాలను పొందాలని అనుకుంటున్నారా…? అయితే తప్పకుండా మీరు ఈ బిజినెస్ ఐడియా గురించి చూడాలి. ఈ బిజినెస్ కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా మంచిగా డబ్బులు కూడా మీరు సంపాదించొచ్చు. అదే గోధుమ పిండి బిజినెస్.

 

నిత్యం రోటీలు, పరాటాలు తయారు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే బేకరీ లో కూడా ఎక్కువ గోధుమపిండి వాడతారు. ఈ గోధుమ పిండి వ్యాపారాన్ని మీరు మొదలు పెడితే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. పైగా పల్లెటూర్లో అయినా పట్టణాల్లో అయినా ఈ మిల్లులు కి డిమాండ్ బాగా ఉంటుంది.

మీరు మంచి గోధుమలను మరియు ఇతర గింజలని తీసుకు వచ్చి మిల్లులో పిండి తయారు చేసి
సేల్ చేయొచ్చు. దీని కోసం మీరు నాణ్యమైన గోధుములని మాత్రమే ఉపయోగిస్తే మీ వ్యాపారం బాగుంటుంది. తయారు చేసిన పిండి ప్యాకెట్ లో వేసి వివిధ సైజుల వారీగా ప్యాక్ చేసి అమ్మచ్చు. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి రెండు నుంచి మూడు లక్షలు అవసరమవుతాయి.

అలానే 200 నుండి 300 స్క్వేర్ ఫీట్ స్థలం అవసరం. ఒకవేళ పెద్ద పెద్ద మిషన్స్ ను కొనుగోలు చెయ్యాలంటే నాలుగు నుండి ఆరు లక్షల రూపాయలు అవసరం అవుతాయి. అలానే లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం 10 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు నుండి మీరు లోన్ తీసుకుని ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. ఒకసారి ఇవన్నీ పూర్తి అయిపోతే ఆ తర్వాత నుండి మంచిగా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇలా గోధుమపిండి వ్యాపారంతో మీరు లాభాలను పొందొచ్చు.