తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త : త్వరలోనే 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీ !

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటు వంటి నిరుద్యోగులకు కేసీఆర్‌ రాష్ట్ర సర్కార్‌ తీపి కబురు చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ల్లో గెస్ట్ లెక్చరర్ లను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వం. 1654 మంది గెస్ట్ లెక్చరర్ లను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌.

telangana-logo

గతం లో పని చేసిన వారినే రెన్యూవల్ చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డ్.. ఆలోచన చేస్తుంది. గతం లో పనిచేసిన వారు ఒక వేళ అందుబాటులో లేకుంటే కొత్త వారిని ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవాలని సంబంధిత కాలేజీ లకు ఆదేశాలు జారీ చేయనుంది తెలంగాణ ఇంటర్ బోర్డ్. ఈ 1654 మంది గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీ పై మరో రెండు లేదా మూడు రోజుల్లో ఇంటర్‌ బోర్డు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యకం చేస్తున్నారు.