బిజినెస్ ఐడియా: గుడ్లతో నెలకి యాభై వేలను సంపాదించండిలా..!

మీరు ఏదైనా బిజినెస్ ని చేయాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులను సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియాస్ ని చూడాలి ఈ బిజినెస్ ఐడియా ని మీరు ఫాలో అవ్వడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. మరి ఇంక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం..

కోడి గుడ్ల వ్యాపారం ద్వారా మంచిగ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ వ్యాపారం ని చీప్ గా మాత్రం చూడకండి. ఎందుకంటే ఎక్కువ లాభాలను ఇది తీసుకు వస్తుంది. కోడి గుడ్ల సప్లయర్ గా మీరు పనిని మొదలు పెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీని కోసం మీ దగ్గర ఒక చిన్న గది ఉండాలి. అప్పుడు వ్యాపారం చేయడానికి అవుతుంది.

అలానే ఒక మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా అవసరం అవుతుంది. ఒక కోడిగుడ్డు ధర రూ.4 ఉంటే… మార్కెట్లో ఐదు రూపాయలకి అమ్మచ్చు. అంటే గుడ్డు మీద మీకు రూ.1 లాభం ఉంటుంది. హోల్ సేలర్లు, రిటైల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు రూ.1 లాభాన్ని షేర్ చేసుకోవాల్సి వుంది. ఇలా చూస్తే ఒక ట్రే గుడ్లు మీద రూ.30 లాభం వస్తుంది. ఎగ్ సప్లయర్ కి ఎంత వస్తుంది అనేది చూస్తే… ఒక ట్రే మీద రూ.6 లాభం వస్తుంది.

20 షాపుల లో మీరు ఐదు ట్రేల ప్రకారం 100 ట్రేలను సప్లయ్ చేస్తే మీకప్పుడు రూ.600 లాభం వస్తుంది. ఈ లెక్కన మీకు నెలకు రూ.18000 ఆదాయం వస్తుంది. వీటితో పాటు మీరు రెస్టారెంట్లు, హాస్టల్స్ వంటి చోట్ల సప్లై చేస్తే మీరు యాభై వేల దాకా సంపాదించుకోవచ్చు.