జబర్దస్త్ షోలోకి తిరిగి అడుగు పెట్టనున్న అనసూయ..!!

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే చాలా కాలంగా జడ్జి గా వున్న నాగబాబు వెళ్ళిపోయారు.  రోజా కూడా ఇటీవల మంత్రి పదవి రావడంతో షో కు గుడ్ బై చెప్పింది.

జబర్దస్త్ కు మొదట అనసూయ యాంకర్ గా చేసి అదరగొట్టింది. తర్వాత గ్యాప్ రావటం తో రష్మి ని దించారు. ఆమె కూడా తన అందంతో చలాకి తనంతో ఆకట్టు కుంది. కొన్ని రోజులకు  ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేసి రష్మి ని అక్కడ వుంచి, అనసూయ ను మళ్లీజబర్దస్త్ కు పెట్టడంతో రెండు షోలు సూపర్ హిట్ అయ్యాయి. జబర్దస్త్  లో అనసూయ మీద ఆది వేసే పంచ్ లు హైలెట్ అయ్యేవి.అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుదీర్, రష్మీ ల హంగామా అందరికీ తెలిసిందే.

ఇక అనసూయ షో నుండి వెళ్లిపోవడంతో కొన్ని రోజులు రష్మి షోలు చేసుకుంటూ వచ్చింది. రీసెంట్ గా జబర్దస్త్ కుసౌమ్య రావు అనే అమ్మాయిని కొత్త యాంకర్ గా తీసుకొచ్చారు. ఈమె ఇప్పటికే తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించింది.సౌమ్య జబర్దస్త్ యాంకర్ గా వచ్చీ రాని తెలుగులో కవర్ చేస్తూ, యాంకరింగ్ ను మేనేజ్ చేస్తూ వస్తోంది. రీసెంట్ మళ్లీ మల్లెమాల వారు అనసూయను తిరిగి రమ్మని అడిగారని తెలుస్తోంది. దానికి తాను ముందే కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇంకో ఆరు నెలలు తర్వాత ఖచ్చితంగా వస్తానని చెప్పిందట.