బిజినెస్ ఐడియా: ఐదు వేలు పెట్టి ఈ వ్యాపారం చేస్తే చాలు.. లాభాలే లాభాలు…!

-

ఈ మధ్యన ఎక్కువ మంది వ్యాపారాల మీదే దృష్టి పెట్టారు. మంచిగా వ్యాపారాన్ని చేసి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని చూడాలి. ప్లాస్టిక్ వలన ఇప్పుడు మనం ఎంతలా ఇబ్బంది పడుతున్నాము అనేది కొత్తగా చెప్పక్కర్లేదు.

 

ప్లాస్టిక్ వలన పర్యావరణం నాశనం అవుతోంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ ని వాడకుండా ఉంటే మంచిది. ప్లాస్టిక్ కప్స్ లో టీ కాఫీ వంటివి తీసుకోవద్దు చాలామంది ఇలానే అనుసరిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ గ్లాసులకి బదులుగా మట్టి గ్లాసులలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది పైగా పర్యావరణానికి కూడా మంచిది.

మట్కా చాయ్ తందూరి చాయ్ కుల్హాద్ చాయ్ ఇలా చాలా రకాల టీలు మనకి కనబడుతున్నాయి. అయితే వీటన్నిటినీ కూడా మట్టితో చేసిన కప్పుల లోనే అమ్ముతారు. చాలా చోట్ల మట్టి కప్పుల్లోనే టీ పోసి అమ్ముతున్నారు. మట్టితో చేసిన కప్పులకి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మంచిగా లాభాలని పొందడానికి అవుతుంది.

ఈ వ్యాపారం కోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఐదు వేల రూపాయలతో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. 5000 రూపాయలతో చక్కటి లాభాలని పొందొచ్చు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన స్కీమ్ ని కూడా అందిస్తోంది. మట్టివస్తులు తయారు చేయడానికి ప్రభుత్వం అనేక రాయితీలను ఇస్తోంది.

ఈ మట్టి కప్పులు తయారు చేయడానికి నాణ్యమైన మట్టిని ఉపయోగించాల్సి ఉంటుంది అలానే ఏ పరిణామంలో అయితే మీరు కప్పు చేయాలనుకుంటున్నారో ఆ అచ్చు కావాలి మట్కా తయారు చేశాక స్ట్రాంగ్ చేయడానికి వేడి చేయాలి. దీని కోసం పెద్ద కొలిమి కావాలి కపులని కాల్చి మార్కెట్లో మీరు సేల్ చేయొచ్చు టీ మాత్రమే కాదు జ్యూస్, పెరుగు, పాలు వంటివి కూడా ఈ కప్పులలో తాగొచ్చు ఇలా మీరు మట్టి కప్పులని తయారుచేసి అదిరే లాభాలని పొందొచ్చు ఈ బిజినెస్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా ఉండదు మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version