పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో మెదలైన అరెస్టులు..!

-

మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో అరెస్టుల పర్వం మొదలు అయ్యింది. ఈ కేసులో సివిల్ సప్లయి అసిస్టెంట్ మేనేజర్ కోటి రెడ్డి, మానస తేజ మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. నిందితులపై 316 (3) 316 (5) 61 (2) రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. రేషన్ బియ్యం గోడౌన్ నుంచి మిస్సైనట్టు ఫిర్యాదు చేసాడు కోటిరెడ్డి. అయితే కోటి రెడ్డి పాత్ర బియ్యం మిస్సింగ్ లో ఉన్నట్టు మానస తేజను విచారించిన సమయంలో గుర్తించారు.

ఇక ఈ రేషన్ బియ్యం కొనుగోలు చేసిన రైస్ మిల్ యజమాని, లారీ డ్రైవర్ ను అరెస్టు చేసారు. అలాగే నిందితులకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ రేషన్ బియ్యం మాయం కేసులోనే పేర్ని నాని భార్య జయసుధకు ఈరోజు కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. జయసుధకు ముందస్తు బెయిల్ ఇచ్చింది జిల్లా కోర్టు.. అలాగే విచారణకు సహకరించాలని జయసుధకు ఆదేశం ఇచ్చింది. ఇక ఈ బియ్యం మాయం కేసులో ఏ1గా జయసుధ ఉండగా.. ఏ2 మేనేజర్ మానస తేజ్ ను అదుపుక్కి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version