బిజినెస్ ఐడియా: టీ బిజినెస్ తో అదిరే లాభాలనిలా పొందండి..!

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా…? ఆ వ్యాపారం తో మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలను చూద్దాం.

tea business

ఈ మధ్య కాలంలో టీ బిజినెస్ కి బాగా డిమాండ్ పెరిగింది. నిజానికి ఎప్పటి నుండో ఉన్నా ఈ మధ్య కాలంలో రోడ్ సైడ్ కొన్ని టీ కంపెనీలు ఎక్కువ అయ్యాయి. పైగా కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అటువంటి వాళ్ళు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఈ టీ బిజినెస్ బాగుంటుంది.

సాధారణంగా ఇంట్లో టీ తాగే కంటే కూడా బయట ఎక్కువ మందు తాగుతూ ఉంటారు. ఏదైనా పని కోసం బయటికి వెళ్లిన బయటే టీ తాగి వచ్చేస్తూ ఉంటారు. అందుకని చిన్న టీ స్టాల్ ని మొదలు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. పల్లె నుండి పట్నం దాకా మంచి డిమాండ్ దీనికి ఉంటుంది. మామూలుగా బయటి పది రూపాయల నుండి యాభై రూపాయల వరకు టీ ని అమ్ముతారు.

ఇదిలా ఉంటే ఇటీవలే టీ వ్యాపారం కార్పొరేట్ రంగు పులుముకుంది. కొన్ని ప్రత్యేక కంపెనీలు యువకుల చేత టీ స్టాల్ పెట్టించి రెండు నెలల పాటు శిక్షణ కూడా ఇస్తున్నారు. టీ పొడి పాలు మొదలు అన్ని ఆయా కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.

ఇలా వాళ్లు యువకులు చేత వ్యాపారం పెట్టిస్తున్నారు. దీంతో మంచి ఆదాయం వస్తుంది కాబట్టి స్వయంగా మీరు కూడా ఇలా టీ స్టాల్ ని పెట్టుకోవచ్చు. ఈ వ్యాపారం చేసే బాగా ఎక్కువ సంపాదించొచ్చు. ఈ వ్యాపారం తో దాదాపు 20 వేల రూపాయల నుంచి 30 వేల వరకు సంపాదించవచ్చు. ఇలా ఈ బిజినెస్ తో మంచిగా లాభాలు పొందొచ్చు.