ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా మొక్కల్ని పెంచుతున్నారు. ఇళ్లలో, మేడ మీద ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మొక్కల్ని పెంచుతున్నారు. ఇది ఇలా ఉంటే చక్కగా మొక్కలని పెంచి బిజినెస్ చెయ్యచ్చు. పైగా దీని కోసం ఎక్కువ శ్రమ కానీ ఎక్కువ డబ్బులు కానీ పెట్టక్కర్లేదు. ఇక ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే…
ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఏదైనా ఇతర ఉద్యోగం చేస్తూ కూడా ఈ పని సైడ్ నుంచి చేయవచ్చు. దీని కోసం రోజూ కొద్దిపాటి సమయం కేటాయిస్తే చాలు. ఇలా చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి అవుతుంది. అదే ఇండోర్ ప్లాంట్స్ పని కోసం మీరు రోజూ 3 లేదా 4 గంటల సమయం కేటాయిస్తే చాలు.
మీకు చక్కటి ఆదాయం లభిస్తుంది. రూ.1000 పెట్టుబడితో దీన్ని స్టార్ట్ చెయ్యచ్చు. మీరు కనుక ప్లాస్టిక్ కుండీలతో మొక్కల్ని అమ్మారంటే రూ.20కి అమ్మచ్చు. అదే సెరామిక్ అయితే రూ.50కి అమ్మచ్చు. కుండీలు చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేస్తే బాగుంటుంది.
ఒక్కో మొక్కకు కుండీతో సహా పెట్టుబడి రూ.100 అవుతుంటే… దాన్ని రూ.200 నుంచి రూ.150కి అమ్మచ్చు. ఇవి ఇంట్లోనే పెరగగలవు. ఎండతో పనిలేదు. ఇండోర్ ప్లాంట్స్ కింద ప్లమ్ ట్రీ, స్పైడర్, డ్రాగన్, జేడ్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ లాంటి వాటికి డిమాండ్ ఎక్కువ వుంది.