బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ తో మంచి రాబడి… డిమాండ్ కూడా ఎక్కువే…!

Join Our Community
follow manalokam on social media

మీరు ఏదైనా మంచి బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారా..? దీనికి చదువు తో సంబంధం లేదు పైగా ఎవరైనా దీనిని చేసేయొచ్చు. ఆడవాళ్లు కూడా ఈ బిజినెస్ ని పెట్టొచ్చు. మంచి రాబడి వస్తుంది. పైగా డిమాండ్ కూడా ఎక్కువే. అయితే మరి బిజినెస్ కి సంబంధించి వివరాలని ఇప్పుడు చూద్దాం..! పూర్తి వివరాల లోకి వెళితే… మీరు ఇంటి వద్ద నుంచే ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. దీని కోసం తక్కువ డబ్బు అవసరం అవుతుంది.

ఉద్యోగం కోసం చూసి చూసి విసిగిపోయిన వాళ్ళు కూడా ఇలా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. పైగా సీజన్ తో కూడా పని లేదు. అన్ని సీజన్స్ లో కూడా మంచి డిమాండ్. అదే పచ్చళ్ళ బిజినెస్.మీరు రూ.10 వేలతో చిన్న స్థాయిలో ఊరగాయ బిజినెస్‌ను ప్రారంభించొచ్చు. తర్వాత మీరు కష్టపడి వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మీరు వీటిని మీ ఇంట్లోనే తయారు చెయ్యచ్చు.

ఎప్పుడు కూడా మంచిగా వ్యాపారం అవుతుంది. తక్కువ పెట్టుబడి మాత్రమే అవుతుంది. ప్యాకింగ్ కి డబ్బాలు, కవర్స్ అవసరం. అలానే పచ్చళ్ళ లోకి నూనె, కారం, ఆవాలు మొదలైనవి కావాలి. ఈ వ్యాపారం వలన నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు సంపాదించొచ్చు. తర్వాత మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ రాబడి కూడా పెంచుకోవచ్చు.

మంచిగా రాబడి పొందాలంటే మీరు ఆన్ లైన్ లో కూడా సెల్ చేసుకోవచ్చు. లేదా సూపర్ మార్కెట్లకు విక్రయించొచ్చు. ఇలా మంచిగా డబ్బులు సంపాదించచ్చు. కానీ ఎప్పుడు కూడా నాణ్యత, రుచి, శుభ్రత వుండేటట్టు చూసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. అలానే వీటిని పాటిస్తే మీ బిజినస్ కూడా బాగుంటుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...