ఆడపిల్లకి జన్మనిచ్చిన హరితేజ

ప్రముఖ నటి, యాంకర్, తెలుగు బిగ్ బాస్ షో తో ప్రేక్షకులకు చేరువైన హరితేజ పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించింది. హరితేజ కొద్ది రోజుల క్రితం తాను గర్భవతి అన్న విషయం వెల్లడించింది. ఆమె గర్భంతో ఉన్న సమయంలో కూడా పలు రకాల షోస్ చేసింది. ఇక తాను ఆడపిల్లకు జన్మనిచ్చాను అంటూ ఆమె పేర్కొంది.

ఆమె చేసిన పోస్ట్ ప్రకారం నిన్ననే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చి నట్లు తెలుస్తోంది. బిగ్బాస్ సీజన్ వన్ లో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె 2015లో దీపిక అనే వ్యక్తిని పెళ్లాడింది. ఇక ఆడపిల్ల పుట్టింది అన్న విషయం సోషల్ మీడియాలో వెల్లడించిన అనంతరం ఆమెకు అభిమానుల నుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది. తనదైన నటనతో ఆకట్టుకున్న హరితేజ అ ఆ, అల్లుడు అదుర్స్ మొన్నీమధ్య రిలీజ్ అయిన జాంబి రెడ్డి లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.