బిజినెస్ ఐడియా: ఐదు వేలు పెట్టుబడితో ఇలా టిఫిన్ బిజినెస్ చేస్తే నెలకి అరవై వేలు సంపాదించచ్చు…!

-

ఈ రోజుల్లో ఉద్యోగాల కంటే వ్యాపారమే బెస్ట్ అని చాలా మంది అనుకుంటున్నారు. వ్యాపారం చేయాలంటే కాస్త పెట్టుబడి, ఓపిక ఉంటే సరిపోతుంది. అలానే కస్టమర్లని కాస్త ఇంప్రెస్ చేసి వ్యాపారం చేస్తే కచ్చితంగా మంచిగా రాబడి వస్తుంది. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? ఏ వ్యాపారం చెయ్యాలి అనేది మీకు తెలియడం లేదా..? అయితే మీకోసం ఈ బిజినెస్ ఐడియా.

ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా డబ్బులు బాగా వస్తాయి. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు లోకి వెళితే.. ఈ మధ్య కాలం లో చాలా మంది ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ చేసుకోవడానికి ఇష్ట పడుతున్నారు. మీరు కూడా ఆన్లైన్ లో టిఫిన్ సర్వీస్ ను ప్రారంభించి మంచిగా సంపాదించుకోవచ్చు.

మీ ఇంటి నుండే మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. దీని కోసం పెద్దగా పెట్టుబడి కూడా అక్కర్లేదు. కేవలం 10 వేల వరకు ఖర్చు పెట్టచ్చు లేదు అంటే ఐదు వేల నుండి వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. మీ చుట్టు పక్కల ఉన్న వాళ్లకి మీరు మీ వ్యాపారం గురించి బాగా తెలియజేయాలి. అలానే వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్లు తీసుకుంటూ ఉండాలి.

యూపీఐ ద్వారా అమౌంట్ ని పే చేసేలాగ ఏర్పాటు చేసుకుంటే సరి పోతుంది. ఈ వ్యాపారం కోసం ఒక వంట మాస్టర్ కావాలి. అదే విధంగా డెలివరీ చేయడానికి టూ వీలర్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ వస్తే.. వాటిని డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్స్ ని ఏర్పాటు చేసుకోవాలి.

మీరు మంచిగా క్వాలిటీ తో టిఫిన్స్ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీ బిజినెస్ బాగుంది అంటే సాయంత్రం పూట స్నాక్స్ కూడా మీరు చేసి అమ్మచ్చు. ఇలా నెలకి అరవై వేల వరకు కూడా సంపాదించుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news