ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా మంది రైతులు ఈ మధ్య సేంద్రీయ వ్యవసాయం పై మక్కువ చూపిస్తున్నారు. అయితే ఈ రోజు సేంద్రియ వ్యవసాయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. సాధారణంగా కెమికల్స్ ని వాడకుండా ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేపపిండి వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తారు.
సేంద్రియ సాగు విధానం లో ఎరువుల తయారీ విధానం:
ఈ ఎరువుల కి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. రైతులు దీని కోసం ఆవు పేడ, ఆవు మూత్రం, శనగ పిండి, బెల్లం, పుట్టమన్ను వంటివి వాడతారు. ఈ పదార్థాలన్నింటినీ కలిపి వారం రోజులు నిల్వ ఉంచాలి. ఇలా జీవామృతం తయారవుతుంది. ఈ నీటిని మొక్కలు మొదల్లో వెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. పైగా ఖర్చు కూడా తక్కువ అవుతుంది.
సేంద్రియ ఎరువులు లో మొదటి పద్ధతి:
ఎండబెట్టిన ఆవు పేద, గేదె పేద, ఆకు తొక్కు, వర్మీ కంపోస్టు, వేప పిండి వంటి పదార్థాలను కలిపి మొక్కలకి అందించాలి.
సేంద్రియ ఎరువులు లో రెండో పద్దతి:
అలానే రెండో పద్ధతిలో జీవామృతం వెయ్యాలి. ఇలా సహజ రసాన్ని ఉపయోగించాలి.
సేంద్రియ సాగు విధానం లో దుక్కిదున్నడం:
భూమిని ఎక్కువ లోతులో దుక్కి చేయడం వల్ల నేలకోత సమస్య ఏర్పడుతుంది. అలానే నేలలో ఉన్న సూక్ష్మజీవులు ప్లనకాల సంఖ్య పూర్తిగా తగ్గుతుంది దీంతో నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేలను దున్నేటప్పుడు కేవలం రెండుసార్లు మాత్రమే 15 సెంటీమీటర్ల లోతు మించకుండా దున్నాలి. ఎక్కువ లోతు తో దుక్కిదున్నడం మంచిది కాదు.
సేంద్రియ సాగు విధానం లో పంట మార్పిడి:
ఒక పంట పండించి దాని తర్వాత మరొక పంట సాగు చేయొచ్చు. ఇలా చేయడాన్ని పంటమార్పిడి అని అంటారు. పంట మార్పిడి చేయడం వల్ల అభివృద్ధి ఉంటుంది. నిజానికి ఈ వ్యవసాయంలో పంట మార్పిడి చేయడం వల్ల నేలలోని సూక్ష్మ జీవ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
అదే విధంగా నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పంట మార్పిడి విధానంలో మూడు నుండి నాలుగు సంవత్సరాలకి ఉండాలి. అయితే మొదటి సంవత్సరంలో పంట ఎక్కువగా ఉండే దానిని వేసుకోవాలి. తర్వాత లెగ్యూమ్ జాతికి చెందిన దానిని వేసుకోవాలి. ధాన్యపు పంటలు కూరగాయలతో పండించవచ్చు. పచ్చిరొట్ట ఎరువులు కూడా ఈ పద్ధతిలో ఒక భాగంగా వేయాలి.
నీళ్లు వాడకము:
ప్రతి పంటకి కూడా నీటిని అందించడం చాలా ముఖ్యం. ఎక్కువ తక్కువ కాకుండా సరైన పద్ధతిలో నీటిని ఇస్తే బాగుంటుంది. ఎక్కువ నీటిని ఉంచకుండా చూసుకోవాలి. ఎక్కువగా నీరు నిల్వ ఉండి పోతే సమస్యలు వస్తాయి. అలానే పంట నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ లో అవసరమైనంత నీటిని మాత్రమే ఇవ్వాలి.
సేంద్రియ సాగు విధానం లో సాగు పద్ధతులు:
పంట మార్పిడి, అంతర పంటలు, వ్యాధినిరోధక రకాలు, కీటక ఎరలు అమర్చడం వంటి వాటి ద్వారా సాగు చెయ్యచ్చు.