బిజినెస్ ఐడియా: ఆర్గానిక్ చాకోలెట్స్ తో లక్షల్లో లాభాలు..!

-

చాలా మంది వ్యాపారాలను చేయడానికి ఇష్ట పడుతూ ఉంటారు. అయితే మంచి బిజినెస్ ని కనుక మొదలు పెడితే లాభాలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియా ని ఫాలో అవ్వొచ్చు. చాక్లెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. చిన్న పిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకూ చాక్లెట్లని బాగా తింటూ ఉంటారు.

అయితే చాక్లెట్ ను తయారు చేసి సులభంగా డబ్బు సంపాదించవచ్చు. పైగా లక్షల్లో లాభాలు కూడా ఉంటాయి. ఈ ఐడియా ని ఫాలో అయ్యి దేవాన్ష్ బిజినెస్ ని మొదలు పెట్టారు. ఇక ఈ చాకోలెట్స్ బిజినెస్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనికి సంబంధించి ఆయన కోచింగ్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత పస్కాటి అనే ఆర్గానిక్ చాక్లెట్ బ్రాండ్ మొదలు పెట్టారు.

పస్కాటి మొట్టమొదటి ఆర్గానిక్ సర్టిఫైడ్ చాక్లెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం 14 రకాల చాక్లెట్లను తయారు చేస్తోంది. కేరళలోని ఇడుక్కి మరియు మలబార్ ప్రాంతంలోని రైతు సంఘాల నుంచి కోకో గింజలు కొంటున్నారు. స్వచ్ఛమైన చాక్లెట్లను అందించడమే ఆ కంపెనీ ధ్యేయం. విదేశాల్లో లాగ భారత మార్కెట్లో కూడా దీన్ని తయారు చేసే వాళ్లు చాలా తక్కువ.

పస్కాటి యుఎస్డీఏ ఆర్గానిక్ సర్టిఫికెట్ కలిగి ఉంది. ఈ చాక్లెట్ తినడం వల్ల ఎలాంటి హాని కలగదు. ఇలా ఆర్గానిక్ చాక్లెట్లతో లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. మీకు కూడా ఈ వ్యాపారం నచ్చితే ఫాలో అవ్వొచ్చు. చక్కగా డబ్బులు సంపాదించడానికి అవుతుంది. అలానే ఆర్గానిక్ చాక్లెట్లు తక్కువ మంది చేస్తున్నారు కాబట్టి వ్యాపారం బాగా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news