జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను తప్పించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్… తాజాగా కడప జైలు ఇన్చార్జి సూపరిండెంట్ వరుణ రెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణ రెడ్డి ఒంగోలు జైలర్ గా బదిలీ అయ్యారు. అలాగే ఒంగోలు జైలు సూపరిండెంట్ గా ఉన్న ప్రకాష్ నువ్వు కడప చేయలేదు గా బదిలీ చేశారు సీఎం జగన్.
గతంలో వరుణ రెడ్డి అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గతంలో పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దుశీను అనంతపురం జైల్లోనే హత్యకు గురైనప్పుడు వరుణ రెడ్డి జైలర్ గా ఉన్నారని… ఇప్పుడు అదే అదే స్వర్ణ రెడ్డి కడప జైలర్ గా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఇక ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో నే వరుణ రెడ్డిని సీఎం జగన్ బదిలీ చేసినట్లు సమాచారం అందుతోంది.