మాజీ కాంగ్రెస్ నేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అమరిందర్ సింగ్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అమరిందర్ సింగ్ సంబంధాల గురించి తెలిసిన రోజే ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. అమరిందర్ పేద ప్రజలను ఆలింగనం చేసుకోవడం చూశారా..అని ప్రజలను ప్రశ్నించారు. పంజాబ్ లో ఎప్పుడూ.. ద్వేషాన్ని వ్యాప్తి చేయలేరని ఆయన అన్నారు. తప్పుడు హామీలు కోరుకుంటే.. ఎవరైనా మోదీ, అమరిందర్, బాదల్, కేజ్రీవాల్ మాటలు వినొచ్చంటూ.. ఎద్దేవా చేశారు.
గతేడాది అమరిందర్ సింగ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించి చరణ్ జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా చేసింది. దీంతో అమరిందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ని స్థాపించాడు. ప్రస్తుతం అమరిందర్, బీజేపీ పొత్తుతో పంజాబ్ లో పోటీ చేస్తున్నారు.