బిజినెస్ ఐడియా: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్..రైతులకు మంచి బెనిఫిట్..

ఈ మధ్య కాలంలో వివిధ రకాల మొక్కలను పెంచుతూ డబ్బులను సంపాదించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు.. ఇష్టాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు కొందరు. అలా మొక్కల పై ఆసక్తి కలిగిన వాళ్ళ కోసం మంచి ఐడియా ఉంది. ఇప్పుడు చెప్పబోయె మొక్కలను నాటడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు..ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అయితే ఈ వ్యాపారంలో ఓపిక చాలా అవసరం.నాటిన చెట్లు 8 నుంచి 10 సంవత్సరాలలో సిద్ధంగా ఉంటాయి. మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఈ వ్యాపారం మీకు బాగా నచ్చుతుంది. చెట్ల పెంపకంలో పెట్టుబడి పెట్టడం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. చెట్లు పెరగడానికి సమయం తీసుకున్నప్పటికీ మంచి లాభాలను అందిస్తాయి. మార్కెట్‌లో ఈ 4 చెట్లకి బాగా డిమాండ్‌ ఉంది..అవేంటో ఒకసారి చూడండి..

టేకు చెట్ల పెంపకం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. టేకు కలపకు మార్కెట్‌లో ఎల్లప్పుడు డిమాండ్‌ ఉంటుంది. ఇది చాలా బలమైన కర్ర. టేకు చెట్లను పెంపొందిస్తే చాలా డబ్బు సంపాదించవచ్చు.

అత్యంత ఖరీదైన చెట్లలో ఒకటి గంధపు చెట్లు. దీని కలపకి చాలా ధర పలుకుతోంది. గంధం చెక్కను మార్కెట్‌లో కిలో 27 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చందనం చెట్ల పెంపకం ద్వారా మంచి లాభం పొందవచ్చు..

రోడ్లపై వెళ్తున్నప్పుడు ఇరువైపులా ఎత్తైన పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఇందులో ఎక్కువగా నీలగిరి చెట్లే ఉంటాయి. ఇవి పనికి రాని చెట్లని చాలా మంది భావిస్తారు. కానీ వీటితో బోలెడు లాభాలున్నాయి. ఇవి ఆస్ట్రేలియా మూలానికి చెందిన చెట్లు. మనదేశంలో కూడా వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నీలగిరి చెట్లను సాగుచేస్తే లక్షల్లో ఆదాయం వస్తుంది..ఈ చెట్ల సాగుకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు..చాలా తక్కువ..

మహోగని చెట్టు విలువైన చెట్లలో ఒకటిగా చెబుతారు. ఈ చెట్టులోని దాదాపు ప్రతి భాగం చాలా విలువ ఉంటుంది. దీనిని రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే సాధనం అని చెప్పవచ్చు. దీని కలప ఓడలు, ఫర్నిచర్, ప్లైవుడ్, అలంకరణలు, శిల్పాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు..ఇవి కూడా విలువైన చెట్లు.. పైన తెలిపిన చెట్లను పెంచుకోవడానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది.. ఈ చెట్ల పెంపకం కోసం వ్యవసాయ నిపుణులను సంప్రదించాలి..