బిజినెస్ ఐడియా: సంవత్సరం పాటు డిమాండ్ ఉండే బిజినెస్..నెలకు 60 వేలు లాభం..

-

మన దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న వ్యాపారం పాలు..పల్లెల్లో కన్నా, పట్టణాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది.అందుకే డైరీ ఫామ్ పెట్టి పాల వ్యాపారం చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది విద్యావంతులైన యువకులు కూడా డైరీ ఫామ్‌ బిజినెస్ చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు..డెయిరీ ఫార్మింగ్ చేయడానికి ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పాడి రైతులకు రాయితీలు అందిస్తాయి.

 

హర్యానా వంటి రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ కోసం ఎవరైనా ఆవు లేదా గేదెను కొనుగోలు చేస్తే.. ప్రభుత్వం ఒక్కో గేదెకు రూ.50 వేలు, ఆవుకు రూ.30 వేలు రుణం ఇస్తుంది. ఈ రుణం వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. ఆ వడ్డీని కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లించాలి..పాల ధర ఎక్కువగా వుండే ప్రాంతాల లో ఈ వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలు వస్తాయి.ముర్రా జాతి గేదెలు పాలు ఎక్కువగా ఇస్తాయి. ఆవుల్లో జెర్సీ, అమెరికన్ జాతుల ఆవులను కొనుగోలు చేయాలి. ఈ రెండు రకాలు ఎక్కువ కాలం పాటు.. అధిక మొత్తంలో పాలు ఇస్తాయి. ఈ పశువులను కట్టేసేందుకు తగినంత స్థలం ఉండాలి.

మార్కెట్ లో మంచి పాలు ఇచ్చే గేదె 70 వేలకు పైగా ఉంటుంది.పచ్చి, ఎండుగడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.చిన్న స్థాయిలో డైరీ ఫామ్ పెట్టిన అన్నీటికి కలిపి 3.50 లక్షలు పెట్టుబడి అవసరం.గేదె రోజుకు 12 లీటర్ల పాలు ఇస్తుంది. అదే ఆవు 18 లీటర్ల వరకు ఇస్తుంది. మొత్తం ఐదు పశువుల నుంచి రోజుకు 90 లీటర్ల పాలు పొందుతారు. మీరు ఈ పాలను నేరుగా వినియోగదారుడికి లీటరు రూ.60కి విక్రయించవచ్చు. తద్వారా రోజుకు 5,400 వస్తాయి. కనీసం 4 వేలు వచ్చాయనుకున్నా.. నెలకు లక్షా 20వేల రూపాయలు వస్తాయి. ఇందులో పనివాళ్ల జీతం, పశుగ్రాసం, ఇతర ఖర్చుల కింద 60 వేల వరకు పోయిన సగం డబ్బులు మిగులుతాయి.ఇలాంటి బిజినెస్ ఆలోచన ఉంటే మీరు కూడా మొదలు పెట్టిండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version