సొంతపార్టీ నేతలపైనే మాజీమంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

-

త‌న సొంత పార్టీ నేత‌ల‌పైనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై సొంత పార్టీ వాళ్లే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బాలినేని శ్రీనివాస‌రెడ్డి సోమ‌వారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు బాలినేని శ్రీనివాస‌రెడ్డి . అలా సొంత పార్టీలో ఉంటూనే త‌న‌పై కుట్ర‌లు చేస్తున్న వారెవ‌రో త‌న‌కు తెలుసున్న బాలినేని… వాళ్ల సంగ‌తి చూస్తానంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌న‌ను టార్గెట్ చేస్తున్న వారితో త‌న పార్టీ నేత‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని కూడా మ‌రింత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బాలినేని శ్రీనివాస‌రెడ్డి.

తాను త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు బాలినేని శ్రీనివాస‌రెడ్డి. అంతేకాకుండా రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని కూడా బాలినేని శ్రీనివాస‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఓ కేసు విషయంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తితోనే కేసులు ఉప‌సంహ‌రించుకున్నట్లు వివ‌రించారు బాలినేని శ్రీనివాస‌రెడ్డి. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస‌రెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version