పూల జడ ఆదాయం కార్పోరేట్ జీతంతో సమానం…!

-

ఇది వరకు ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే చాలు కుటుంబం అంతా హాయిగా గడిచేది. కాలంతో పాటు అవసరాలు మారుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. ఎవరికి వారు సౌకర్యవంతంగా ఉండాలని భావిస్తున్నారు. నేడు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ మొబైల్ ఫోన్, టీవీ, ప్రిడ్జ్, ఏసీ, మిక్సి, గ్రైండర్, టూ వీలర్, లేకుండా ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ కూడా తమ సంపాదనలో కొంత భాగాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారు.

మారిన అవసరాలకు అనుగుణంగా ఆదాయ వనరులు పెరిగాయి. ఖర్చు చేయడం ఎంత తేలిక అయ్యిందో అలాగే తెలివి ఉంటే సంపాదన మార్గాలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గృహిణులు ఇళ్లలో ఉండి కుటుంబ భాద్యతలు నిర్వహిస్తూనే తమకు నైపుణ్యం ఉన్న వాటిలో ఆదాయ మార్గాలు ఎంచుకున్నారు. వాటిలో ఒకటి పెళ్లి వస్తువులు తయారుచేయడం. వీటిలో చాలా రకాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి పెళ్లి పూలజడ తయారీ. ఈ మధ్య ఎంత పెద్ద ఫంక్షన్ లలో చూసిన రకరకాల పూల జడలు వేసుకుని కనిపిస్తున్నారు ఆడవాళ్ళు. వాటిలో కూడా పెళ్లి కూతురుకి ఒక డిజైన్, మిగతా వారికి వేరే వేరే డిజైన్స్ లలో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. అయితే వాటిని చాలా మంది గృహిణులు ఇళ్లలో ఉండి తయారుచేసి ఇస్తున్నారు. వారికి తెలిసిన బ్యూటీపార్లర్ వారితో అనుసంధానం అయ్యి,

పెళ్లి ఆర్డర్ లు తీసుకుని ఈ పెళ్లి పూల జడలను తయారు చేసి ఇస్తున్నారు. వారి నైపుణ్యాన్ని కనబరుస్తూ రకరకాల అందమైన పూల జడలను అల్లుతున్నారు. అందుబాటులో ఉన్న పూలనే కాకుండా కస్టమర్ అభిరుచి నీ బట్టి, అంతే కాకుండా వారు ధరించే దుస్తులకు అనుగుణంగా సరిపోయే రంగుల్లో పూలను ఉపయోగించి ఈ పూల జడలు, జడ ముడులను అలంకరించే అందమైన వేనీలను తయారుచేస్తున్నారు.

పలువురు మహిళలు ఈ వ్యాపారాన్ని తమ ఇంటివద్ద ఉంటూనే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండటంతో తమ ఫోన్ లోని వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుని ఇంటి వద్ద ఉంటూనే మహిళలు సంపాదనలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news