స్ఫూర్తి: ఆరోగ్యకరమైన స్నాక్స్ తో ఎనిమిది లక్షలు.. ఈమె కష్టాన్ని చూస్తే మెచ్చుకుంటారు…!

చాలా ఊళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఆడపిల్లలకి త్వరగా పెళ్లిళ్లు చేసేస్తూ ఉంటారు. పైగా పెద్దగా చదవనివ్వరు కూడా. హర్యానాలోని బక్రా గ్రామంలో కూడా అంతే. బాలికలను ఎక్కువగా చదివించరు పూజ శర్మ కూడా ఆ ప్రాంతానికి చెందిన ఆమె. ఈమె కి 20 ఏళ్ల వయసులో పెళ్లి అయిపోయింది. తర్వాత ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు. ఈమె భర్త వ్యవసాయం చేస్తూ నెలకు 4 వేల రూపాయలు సంపాదించేవాడు. అయితే ఈమె తన భర్తకి సపోర్టు ఇవ్వాలని ఎన్జీవో లో ఉద్యోగం చేసి నెలకి రెండు వేల ఐదు వందలు సంపాదించేది.

 

అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు గ్రామస్తులు కి కుట్లు కి సంబంధించిన పాఠాలని చెప్పేవారు. అయితే కుట్టుపని చేయడం వల్ల అంతగా ఆదాయం రాదని.. మాకు ఏదైనా కొంచెం ప్రత్యేకమైనది కావాలి అని 42 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ఆ తర్వాత కాల్చిన సోయా బీన్స్ ను ఆరోగ్యకరమైన అల్పాహారంగా తయారు చేసి అమ్మడం మహిళలకు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించుకున్నారు అని పూజ చెప్పారు.

10 మంది మహిళలను గుర్తించే పనిని పూజకు అప్పగించారు. అధికారులు వాళ్లను ఎంపిక చేయడం శిక్షణ ఇవ్వడం తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. దీనికి కావలసిన పదార్ధాలని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు కూడా చేసారని పూజ అన్నారు. వీళ్ళ వెంచర్ ని మొదలుపెట్టడానికి ప్రైవేట్ బ్యాంకు నుండి 10,000 రూపాయలను తీసుకున్నారు. అ

యితే డబ్బులు పరంగా ఇబ్బంది లేదు కానీ ఆమె భర్త మాత్రం ముందు తిరస్కరించారు. చాలా రోజులు పాటు కష్టపడి తన భర్తని ఒప్పించింది పూజ. గోధుమతో చేసినా బిస్కెట్లు మొదలైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేయడం మొదలు పెట్టారు. క్రమంగా వీళ్ళ బిజినెస్ కూడా పెరిగింది డిమాండ్ కూడా పెరిగింది. ఈ వ్యాపారం ద్వారా సంవత్సరానికి 8 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు నిజానికి మహిళలు ఇంటికే పరిమితం అవ్వకుండా ఈమె లాగ మంచి దారిన పడితే సక్సెస్ అవ్వగలరు.