బిజినెస్ ఐడియా: ఫ్లై యాష్ ఇటుకలతో నెలకి లక్ష సంపాదించండి..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే మీకు మంచి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ని కనుక మీరు మొదలు పెడితే మంచిగా లాభాలని పొందొచ్చు. ఇక వ్యాపారం గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీని కోసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీరు ప్రతి నెల 1 లక్ష రూపాయలు సంపాదించచ్చు. అదే ఫ్లై యాష్ ఇటుకల వ్యాపారం.

ఈ ఇటుకలను రాకాసి బొగ్గు బూడిదతో తయారు చేస్తారు. దీనిని సాధారణంగా సిమెంట్ ఇటుక అని కూడా అంటారు. పవర్ ప్లాంట్లలో మండించిన రాకాసి బొగ్గు బూడిద, సిమెంట్, రాతి ఇసుక కలపడం ద్వారా ఇవి చెయ్యచ్చు. ఈ బిజినెస్ కోసం 100 గజాల స్థలం కావాలి. అలాగే మీరు కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యాపారం ద్వారా మీరు ప్రతి నెలా లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

మీరు ఒక నెలలో 1 లక్షల ఇటుకలను విక్రయిస్తే, మీ నెలవారీ సంపాదన ఒక లక్ష వరకు ఉంటుంది. ఈ వ్యాపారం చేయడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే, మీరు దాని కోసం ముద్ర రుణం తీసుకోవచ్చు. అది స్వయం ఉపాధి పథకం కింద మీకు సులభంగా లభిస్తుంది.

మీరు మాన్యువల్ మెషిన్‌తో తగినంత ఇటుకలను తయారు చేయలేకపోతే మీరు 10-12 లక్షల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ఆటోమేటిక్ మెషిన్ కొనుగోలు చేయవచ్చు. దీనితో, 1 గంటలో 1 వేల ఇటుకలను తయారు చెయ్యచ్చు. ఇలా ఈజీగా మీరు ఒక నెలలో 3-4 లక్షల ఇటుకలను సులభంగా చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version