ఇవాళ కేటీఆర్ ఈ – కారు రేస్ కేసులో కీలక పరిణామం ఇవాళ చోటుచేసుకోనుంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 8 న సుప్రీంకోర్టులో slp వేశారు కేటీఆర్. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో slp వేశారు కేటీఆర్. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్.
క్వాష్ చేసేందుకు నిరాకరించింది హైకోర్టు, దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఈ తరునంలోనే.. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగనుంది. కేటీఆర్ పిటీషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, ఏసిబి లు కేవియట్ దాఖలు చేశారు. ఇవాళ్టికి 37వ నెంబర్ గా లిస్ట్ అయింది కేటీఆర్ కేస్. దీంతో సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ ఇవాళ జరుగనుంది.