బిజినెస్ ఐడియా: రూ. 15 వేలతో పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం..కళ్ళు చెదిరే లాభాలు..

-

సొంతంగా వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది..అతి తక్కువ డబ్బులతో పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయాన్ని పొందే ఎన్నో బిజినెస్ లు అందుబాటులో ఉన్నాయి.అందులో చెత్త రీ సైకిలింగ్ కూడా ఒకటి.మునిసిపాలిటీ వాళ్ళు సేకరిస్తున్న చెత్తలో ఎన్నో పనికి వచ్చే వస్తువులు కూడా ఉంటాయి.వాటిని తిరిగి ఉపయోగించి మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.. అదేలానో ఇప్పుడు చుద్దాము..

కేవలం రూ.15వేల పెట్టుబడితో రీసైక్లింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. బాగా కష్టపడితే.. భవిష్యత్ అంతా బంగారుమయం అవుతుంది.రీసైక్లింగ్ వ్యాపారం చాలా పెద్దది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. మన భారతదేశంలో 277 మిలియన్ టన్నులకు పైగానే చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇతర భారీ మొత్తంలో వ్యర్థాలను నిర్వహించడం చాలా కష్టమైన పని.

ఈ క్రమంలోనే చాలా మంది ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. చెత్తతో ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు, వేస్ట్ మెటీరియల్‌తో పెయింటింగ్‌లు వంటి వాటిని తయారు చేస్తూ..ఎంతో మంది వ్యాపారం చేస్తున్నారు. నెలనెలా లక్షలు సంపాదిస్తున్నారు.ముందుగా మీ చుట్టూ ఉంటే వ్యర్థ పదార్థాలను సేకరించాల్సి ఉంటుంది. చెత్తను తొలగించే వారి నుంచి కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. లేదంటే మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా వ్యర్థాలు తీసుకోవచ్చు. చెత్తను సేకరించిన తర్వాత వాటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇప్పుడు వాటి నుంచి ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. చెత్తను పూర్తిగా శుభ్రం చేయాలి. ఉదాహరణకు టైర్ల నుండి టైర్ సీటింగ్ చైర్ తయారు చేయవచ్చు. అమెజాన్‌లో దీని ధర దాదాపు రూ.700. అంతే కాకుండా కప్, వుడెన్ క్రాఫ్ట్, కెటిల్, గ్లాస్, దువ్వెన, ఇతర గృహాలంకరణ వస్తువులను కూడా తయారు చేయవచ్చు..

ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లో వాటిని విక్రయించవచ్చు. ది కబాడీ.కామ్ స్టార్టప్ యజమాని శుభమ్ రీసైక్లింగ్ బిజినెస్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. మొదట చెత్తను సేకరించి దాన్ని రీసైకిలింగ్ చేశారు. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు..ఈ కంపెనీలు నెలలో 40 నుంచి 50 టన్నుల చెత్తను సేకరిస్తాయి. ఎంత ఎక్కువ చెత్తను సేకరిస్తే.. అన్ని ఉత్పత్తులను తయారు చేయవచ్చు..పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version