పెళ్ళైన ఆడవాళ్ళూ… మీకు వంట చేయడం వస్తే చాలూ…!

-

ఉద్యోగ అవకాశాలు ఎక్కువైన తర్వాత మనుషులకు కాళీ లేకుండా పోయింది అనేది వాస్తవం. కనీసం తిండి తినడానికి కూడా లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. పిల్లలతో ఆడుకోవడం, భార్యతో కూర్చుని కబుర్లు చెప్పడానికి కూడా కొంత మందికి సమయం ఉండటం లేదు. సంపాదన మీద ఉన్న దృష్టితో అన్నీ వదులుకుంటున్నారు కొందరు. ముఖ్యంగా తిండి తినే విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ అంతా ఇంతా కాదనే చెప్పాలి. చాలా మంది బయట ఆహారానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం మనం చూస్తున్నాం.

ఇప్పుడు అలాంటి వారి కోసమే కొన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. హోం ఫుడ్ అంటూ కొందరు నగరాల్లో ఆహారం అందించే కార్యక్రమాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులకు కనీసం తిండి తినడానికి కూడా సమయం ఉండటం లేదు. దీనితో వారు ఎక్కువగా స్విగ్గి, జోమాటో, ఫుడ్ ఫండా వంటి యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఆ మార్కెట్ ని మీ వైపుకి తిప్పుకోవచ్చు అంటున్నారు కొందరు. ఎలా అంటే… మీకున్న పరిచయాల ద్వారా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. మీకు చేతి వంట రుచిగా వండటం వస్తే…

ఇంట్లో కాళీగా ఉండకుండా… ఒక 20 లేదా 30 మందికి భోజనం గాని టిఫిన్ గాని చేసి దానిని మీకున్న పరిచయాల ద్వారా దగ్గరలోని కంపెనీలకు అందించవచ్చు. ఒక డెలివరి బాయ్ ని పార్ట్ టైం గా పెట్టుకోవడమో లేకపోతే మీరే వెళ్లి ఇన్ని ఆర్డర్లు అని తీసుకుని వారికి ఆహారాన్ని అందించాలి. ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో అయితే ఈ వ్యాపారం కొందరు మొదలుపెట్టి విజయవంతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో కాళీగా ఉండే వారికి ఈ వ్యాపారం బాగుంటుంది అని చూస్తున్నారు… పెళ్లి అయిన ఆడవాళ్ళకు అయితే ఇది మరీ సులువు… హోం ఫుడ్ కూడా కాబట్టి మీ వద్ద నాణ్యత ఉంటె వ్యాపారం పది కాలాల పాటు ఉంటుంది. ఆలోచించండి…

Read more RELATED
Recommended to you

Exit mobile version