బిజినెస్ ఐడియా: ఆన్​లైన్​ హోర్డింగ్స్​ వ్యాపారంతో లాభాలు పొందొచ్చు..!

మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ కనుక చేసారు అంటే చక్కటి లాభాలు పొందొచ్చు. ఇక ఈ బిజినెస్ గురించి చూసే… ఆన్​లైన్​ హోర్డింగ్స్​ వ్యాపారం మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి.  ఖర్చు కూడా తక్కువే. ఈ రోజుల్లో చాలా మందికి తమ కంపెనీలను, బ్రాండ్లను మార్కెటింగ్​ చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి దారి చూపించడమే ఈ హోర్డింగ్​ బిజినెస్​ ఐడియా.

డబ్బులు
డబ్బులు

కేవలం ఒకే ఒక వెబ్​సైట్​తో పని మొదలెట్టొచ్చు. మీ వెబ్​సైట్​లో సిటీలోని ఆయా ప్రాంతాల్లో హోర్డింగులు పెట్టడానికి పక్కా స్థలాన్ని గుర్తించాలి. మీ వెబ్​సైట్​లో పెట్టేయ్యాలి. ఎవరైనా కస్టమర్ మీ వెబ్​సైట్​లో లాగిన్​ అయినపుడు ఆ స్థలాన్ని బుక్​ చేసుకుంటారు. అపుడు ఆ స్థలం వారికి మీరు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ నుండి పర్మిషన్ వచ్చాక ఒకే చెప్పచ్చు.

దీనిలో మీరు 5‌0వేల పెట్టుబడి పెట్టి అక్షరాలా ఏడాదికి రూ.20 కోట్ల వరకు సంపాదించచ్చు. షాక్ అవ్వద్దు. ఇది నిజంగా. అవుట్​ డోర్​ అడ్వర్టైజింగ్​ స్టార్టప్​ కంపెనీ గోహోర్డింగ్స్​.కామ్​ (gohoardings.com) వ్యవస్థాపకురాలు దీప్తి అవస్థీ శర్మ ఇలానే స్టార్ట్ చేసారు. ఆమె వ్యాపారం గురించి చూస్తే.. ఈమె కేవలం 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆన్‌లైన్ హోర్డింగ్ స్టార్ట్ చేసారు. మరుసటి సంవత్సరం నుంచి 12 కోట్లు సంపాదించడం ప్రారంభమైంది. నెక్స్ట్ కంపెనీ టర్నోవర్ రూ.20 కోట్లు దాటింది. ఇలా కేవలం హోర్డింగ్స్ తో చక్కటి లాభాలని పొందొచ్చు.