మందుబాబలకు తమిళనాట స్టాలిన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇకపై మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు ఉంటేనే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ప్రస్తుతం ఇది నీలగిరి జిల్లాలో మాత్రమే అమలవుతోంది. నీలగిరి జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ దుకాణాలలో ఆధార్ కార్డు మరియు వ్యాక్సిన్ వేసుకన్న సర్టిఫికెట్ ఉంటేనే మద్యం విక్రయిస్తున్నారు.
ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికే పద్దెనిమిదేళ్లు నిండిన 70 శాతం మందికి వ్యాక్సిన్ లను వేశారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా దాదాపు మద్యానికి బానిసైన వ్యక్తులు తాగకుండా ఉండలేరు కాబట్టి వారికి కరోనా రాకుండా వారి నుండి కుంటుంబ సభ్యులకు సోకకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసకుంది. ఇక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.