సాధారణంగా వ్యవసాయమంటే పొలాలు, విత్తనాలు, నీటి పారుదల ఇంకా తినే ఉత్పత్తుల గురించి ఆలోచిస్తాం. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లోని మురద్‌నగర్‌కు చెందిన జితేందర్ చౌదరి తన ఇంటి నుంచే వాణిజ్యస్థాయిలో ముత్యాల సాగును ప్రారంభించాడు. జితేందర్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. అతడు ముత్యాల సాగు దిశగా తనను నడిపించిన కొత్త సంగతులను మనం తెలుసుకుందాం..
కంప్యూటర్స్‌లో పీజీ చేసిన జితేందర్ 2009లో కేవలం రూ.20 వేల పెట్టుబడితో దీన్ని ప్రారంభించాడు. ఈ వ్యాపారంపై ముందస్తుగా కాస్త అవగాహన ఉంటే కేవలం రూ.5 వేల నుంచి రూ. 10 వేల పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చంటున్నాడు జితేందర్.
కావాల్సినవి
మెసెల్స్ మనం చెరువు నుంచి సిమెంట్ టబ్‌లు, లేదా ఫిష్ ట్యాంకులను ఉపయోగించి పెంపకం చేయవచ్చు. ఈ పద్ధతిని రీరిక్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టం (ఆర్‌ఏఎస్) అంటారు.
సరైన అవగాహన
ఆర్‌ఏఎస్‌లు ఫిష్‌ట్యాంకుల నుంచి నీటిని ఫిల్డర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీని వల్ల సమయం, నీరు వృథా కాదు. మెస్సెల్స్ సాగులో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య విషపూరితమైన అమ్మోనియా నిర్వహణ వల్ల వచ్చే వ్యర్థ పదార్థాలను ఆర్‌ఏఎస్ పద్ధతితో సమస్య పరిష్కారమవుతుందని జితేందర్ తెలిపాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుసరిస్తున్నారని అన్నాడు. ఇది చెరువులు ఇతర ట్యాంకుల కంటే మెరుగైన పద్ధతి అని తెలిపాడు.
నియంత్రణ
చెరవులో ముత్యాల సాగు చేసినపుడు ఉష్ణోగ్రత నియంత్రించటం మనకు సాధ్యం కాదు.ఈ పెంపకానికి చెరువులు ఆరునెలల నుంచి వినియోగించినవి కావాలి. అదే చేపల తొట్టె మన నియంత్రణలో ఉంటుంది. కాకపోతే తొట్టెలో ఆల్గే పెంపకం కోసం ఒక వ్యక్తి దాని పెరుగుదలను పర్యావేక్షించాల్సి ఉంటుంది.
దీనిపై అవగాహన పెంచుకోవటానికి ఆన్‌లైన్ కోర్సులతో సహా ఒడిశాలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిఫా) అందిస్తున్న కోర్సు కూడా ఉపయోగపడుతుందని జితేందర్ పెర్కొన్నాడు. మార్కెట్‌లోకి కొత్త మెస్సెల్స్ ప్రారంభించటానికి వాటి గురించి కొన్ని వర్క్‌షాప్‌లకు హాజరుకావడం చాలా ముఖ్యం.
మీరు ప్రారంభిస్తారా?
ఇంట్లోనే దీని సెటప్ కోసం కనీసం రెండు ఫిష్ ట్యాంకులు అవసరం. వీటిని ఒకదానిపై మరోటిని పెట్టాలి. పైన ట్యాంకులోని నీరు కింది ట్యాంకులోకి పడేలా చూసుకోవాలి. దీనికి పై ట్యాంకు అడుగుభాగానికి ఓ రంద్రం చేయాలి. ట్యాంకులకు ఎయిర్, వెంటూరి పంప్‌లను అమర్చాలి, నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది వరుసగా ఏడు రోజులపాటు ఈ ప్రక్రియను కొనసాగించాలి. దీనికి ట్యాంకు పరిమాణం కూడా 2.5 అడుగుల వెడల్పు,1.5 అడుగుల లోతు ఉంటే దాదాపు 50 మెస్సెల్స్ ఒకే ట్యాంకులో పెంచవచ్చని జితేందర్ తెలిపాడు. మెస్సెల్స్‌ల నుంచి వచ్చే ఆల్గే నాణ్యతగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఎందుకంటే అది ఉత్పత్తి చేసిన ముత్యాల నాణ్యతపై ప్రభావం పడుతుంది.
గమనించండి
మీరు ఆర్థిక ప్రయోజనాల కోసం మెస్సెల్స్ పెంచాలనుకుంటే అన్ని లైసెన్సింగ్ అవసరాల కోసం తనిఖీ చేయండి. మీరు ఇంట్లోనే ముత్యాల సాగు ప్రారంభించడానికి ఆసక్తి కలిగి ఉంటే మరింత సమాచారం కోసం జితేందర్– 91–7017563576 లో సంప్రదించవచ్చు.