బిజినెస్ ఐడియా: తులసిని పండించి మూడు నెలల్లో మూడు లక్షలు పొందండి..!

-

మీరు ఏదైనా వ్యాపారం ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు..? ఆ వ్యాపారంతో మంచి రాబడిని పొందాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా తో మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. అదే తులసి సాగు. తులసి మొక్కలను పెంచి మంచిగా లాభాలను పొందవచ్చు. తులసి అనేక వాటికి ఉపయోగపడుతుంది. తలనొప్పి మొదలు క్యాన్సర్ వరకు ఎన్నో సమస్యల్ని తులసి తరిమికొడుతుంది.

పైగా తులసి మొక్కలు పెంచడం చాలా సులభం. తక్కువ మెయింటనెన్స్ ఉంటే సరిపోతుంది. కేవలం నీళ్లు అందేటట్టు బాగా చూసుకోవాలి. దీని కోసం మీకు కొద్దిగా స్థలం అవసరమవుతుంది. ఆ తర్వాత తులసి విత్తనాలను మీరు నాటండి. మీరు కావాలంటే కుండీలలో కూడా వీటిని నాటొచ్చు. అలా కూడా ఎదుగుతాయి.

ఇక ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఎంత అవసరం అవుతుంది అనే విషయానికి వస్తే.. చాలా వ్యాపారాలు మనం మొదలు పెట్టాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇది అలా కాదు. కేవలం 15 వేల రూపాయలు ఉంటే సరిపోతుంది. 15 వేల రూపాయలతో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు.

ఒకసారి విత్తనాలు జల్లిన తర్వాత ఎక్కువ సేపు మీకు పట్టదు. త్వరగా అవి ఎదిగి పోతూ ఉంటాయి. మూడు నెలలకి పూర్తిగా ఎదిగి పోయాక మీరు ఒకేసారి పంట మొత్తం అమ్మచ్చు. దీంతో మీకు మూడు లక్షల రూపాయల వరకూ వస్తాయి. డాబర్, పతాంజలి ఇటువంటి కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మీరు అమ్మచ్చు. ఇలా మీరు మూడు నెలలకి మూడు లక్షలు సంపాదించవచ్చు. ఔషధ మొక్కల కి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ సబ్సిడీని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news