Business Idea : నష్టం లేని వ్యాపారం.. వేలల్లో ఆదాయం.. దీన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు..

-

నేటి కాలంలో ఖర్చులు ఎక్కువైపోయాయి. కాబట్టి అదనంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉంది. చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనంగా ఓ చిన్న వ్యాపారం చేసుకుంటే కచ్చితంగా ఆర్ధికంగా స్థిరంగా ఉంటాం. ఇక మనలో చాలా మంది కూడా వ్యాపారం అనగానే పెట్టుబడి, లాభనష్టాల గురించి కంగారు పడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల వ్యాపారాలను తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించి మంచి లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు. అలా కాలంతో ఏమాత్రం సంబంధం లేకుండా నిత్యం డిమాండ్‌ ఉండే ఒక మంచి బిజినెస్‌ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పెన్సిల్స్‌ వాడకం అనేది కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఎందుకంటే స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసుల్లో ఉండే ఉద్యోగుల వరకూ ప్రతీ ఒక్కరూ కూడా పెన్సిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పెన్సిల్స్‌ తయారీలో కాలంతో పాటు ఎన్నో రకాల మార్పులు జరుగుతూ వచ్చాయి. తాజాగా వెల్వెట్‌ పెన్సిల్స్‌కు మార్కెట్లో డిమాండ్ అనేది బాగా పెరిగింది. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు.ఇంతకీ ఈ పెన్సిల్స్‌ను ఎలా తయారు చేయాలి.? దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..

అయితే ఈ వెల్వెట్ పెన్సిళ్ల తయారీకి కచ్చితంగా ఒక మిషన్‌ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే దీనికి ముడి సరుకు కూడా అవసరపడుతుంది. ఈ వెల్వెట్ పెన్సిల్ తయారీ మిషన్‌ ధర సుమారు రూ. లక్షపైనే ఉంటుంది. దీంతో పాటు ఎలాంటి కలర్‌ లేని పెన్సిల్స్‌ అలాగే గమ్‌, ఒక క్యూబ్‌ కూడా అవసర పడుతుంది. ఇంకా వీటితో పాటు పెన్సిల్స్‌కు అప్లై చేయడానికి కలర్‌ కూడా కావాలి. వీటన్నింటినీ మార్కెట్‌లో చాలా సంస్థలు అందిస్తున్నాయి.

ఇక పెన్సిల్ల తయారీ విషయానికొస్తే ముందుగా క్యూబ్‌ తీసుకొని దానికి నాలుగు పెన్సిల్స్‌ను ఫిక్స్ చెయ్యాల్సి ఉంటుంది. ఆ తరువాత ఒక మిషిన్‌లో కలర్‌ పౌడర్‌ను పోసి ఈ నాలుగు పెన్సిల్స్‌ను అందులో పెట్టాలి. ఆ తరువాత మిషిన్‌ను ఆన్‌ చేయగానే కలర్‌ మొత్తం కూడా పెన్సిల్‌కు అంటుకుంటుంది. ఇక వీటిని పక్కన పెట్టి కలర్‌ ఆరేంత వరకు ఉంచాలి. ఆ తరువాత వీటిని మీ సొంత బ్రాండింగ్‌తో మీరు మార్కెట్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో బౌ బ్యాక్‌ పేరుతో కూడా కొన్ని సంస్థలు ఛాన్స్ కల్పిస్తున్నాయి. అయితే ఇలాంటి సంస్థలకు డబ్బులు చెల్లించే ముందు ఒకటికి రెండు సార్లు కచ్చితంగా ఆలోచించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news