చంద్రబాబువి శ్వేత పత్రాలు కాదు… తప్పుడు పత్రాలు అంటూ విరుచుకుపడ్డారు జగన్. ఇవాళ ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు విడుదల చేసేది శ్వేత పత్రాలు కాదు తప్పుడు పత్రాలు అని.. మేం ఫ్యాక్ట్ పత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్తామని ప్రకటించారు. చంద్రబాబు సబ్జెక్ట్ డైవర్షన్ లో ఎక్స్ పర్ట్ అంటూ చురకలు అంటించారు.
వినుకొండలో రషీద్ పై హత్య ఘటనలో నిందితుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు కేక్ తినిపిస్తున్నారని…. అయినా వారిపై పోలీసులు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే భార్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరిపై కేసులు పెట్టలేదని ఆగ్రహించారు. ఈ హత్య డై చేయటానికి….. మదనపల్లి లో సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం పై రెండు సార్లు చంద్రబాబు రివ్యూ చేశారన్నారు.
డీజీపీ, సీఐడీ చీఫ్ ను హెలికాప్టర్ ఇచ్చి మరీ చంద్రబాబు పంపారని ఎద్దేవా చేశారు.
ఆర్డీఓ కార్యాలయంలో ప్రమాదం జరిగితే ఎమ్మరో లేదా కలెక్టర్, CCLA లో అవే డాక్యుమెంట్లు ఉంటాయి లేదా ఆన్ లైన్ లో ఉంటాయి కదా అంటూ సెటైర్లు పేల్చారు.