బిజినెస్ ఐడియా : అర‌టి పండ్ల‌ను పిండిగా మార్చి చ‌క్క‌ని ఆదాయం సంపాదిస్తున్న మ‌హిళ‌లు..!

-

బిజినెస్ ఐడియా స్వ‌యం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలే గానీ చేసేందుకు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో అర‌టి పండ్ల‌ను పిండిగా మార్చి అమ్మే ఉపాధి కూడా ఒక‌టి. దీన్ని చేయ‌డం చాలా సుల‌భమే. పెద్ద‌గా పెట్టుబ‌డి కూడా అవ‌స‌రం లేదు. పైగా ఆ పిండికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని వ‌ల్ల డ‌బ్బుల‌ను సంపాదించుకోవ‌చ్చు.

క‌ర్ణాట‌క‌లోని సిర్సి అనే ప్రాంతానికి చెందిన వ‌సుంధ‌ర హెగ్డె, ప్ర‌భాక‌ర హెగ్డె అనే ఇద్ద‌రు దంప‌తులు జూలై నెల‌లో అర‌టి పండ్ల‌ను పిండిగా మార్చి అమ్మే వ్యాపారం ప్రారంభించారు. సాధార‌ణంగా అర‌టి పండ్లు ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. ఎరువులు పెద్ద‌గా వాడాల్సిన ప‌నిలేకుండానే అర‌టి పండ్లు పెరుగుతాయి. అంటే కెమిక‌ల్స్ ఉండ‌వు. ఇక అర‌టి పండ్ల‌కు పెద్ద‌గా ధ‌ర కూడా ఉండ‌దు. కానీ వాటిని ప‌చ్చిగా ఉన్న‌ప్పుడే సేక‌రించి పిండి చేసి అమ్మితే ఎక్కువ లాభం వ‌స్తుంది. క‌నుక‌నే వారు ఈ విధంగా వ్యాపారం మొద‌లు పెట్టారు.

ప‌చ్చి అర‌టి పండ్ల‌ను పూర్తిగా తొక్క తీసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని ఎండ‌లో ఎండ‌బెతారు. అవి చిప్స్‌లా మారుతాయి. త‌రువాత వాటిని మ‌ర‌లో వేసి ఆడించి పిండి త‌యారు చేస్తారు. ఆ పిండిని కేజీకి రూ.200 వ‌ర‌కు అమ్ముతారు. 6-8 కిలోల ప‌చ్చి అర‌టి పండ్ల‌తో 1 కేజీ పిండి త‌యార‌వుతుంది. దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇలా వారు వ్యాపారం మొద‌లు పెట్టారు. వారి ఆధ్వ‌ర్యంలో ప్ర‌స్తుతం అక్క‌డ 60 కుటుంబాలు ఇలా పిండి త‌యారు చేసి విక్ర‌యిస్తున్నాయి.

బిజినెస్ ఐడియా

ప‌చ్చి అరటి పండ్ల పిండి బేబీ ఫుడ్ ప్రొడ‌క్ట్స్‌లో క‌లుస్తుంది. చాలా పోష‌కాలు ఉంటాయి. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మార్కెట్‌లో కంపెనీలు దీన్ని ఒక కిలోకు రూ.600కు పైగానే అమ్ముతున్నాయి. కానీ ఇంట్లోనే పిండిని త‌యారు చేసి అమ్మితే రూ.200 కు విక్ర‌యించి కూడా లాభాలను పొంద‌వ‌చ్చు. ఆ మ‌హిళ‌లు కూడా అదే చేస్తున్నారు.

ఈ పిండిని గులాబ్ జామున్‌, ప‌రాఠా, దోశ‌, ఉప్మా, నూడుల్స్, కేక్‌లు, హ‌ల్వా, మాల్ట్‌, కేస‌రి బాత్‌, నిప్ప‌ట్లు, చ‌క్కులి వంటి వంట‌కాల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు. ఆ ప్రాంతంలో ఈ పిండిని చాలా మంది మ‌హిళ‌లు విక్ర‌యిస్తూ నెల నెలా చ‌క్క‌ని ఆదాయం పొందుతున్నారు. వారికి ఇది మంచి స్వ‌యం ఉపాధిగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version