ఈరోస్ తో సుకుమార్ బిగ్ డీల్..!

Sukumar Big Deal with Eros International

క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ రంగస్థలం హిట్ తో తన సత్తా ఏంటో చూపించాడు. ఆర్య తర్వాత సుకుమార్ రేంజ్ తెలిపిన హిట్టు కొట్టిన సినిమా రంగస్థలం మాత్రమే. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు సుక్కు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వెనుక నడిపించేది ఈరోస్ ఇంటర్నేషనల్ వారని తెలుస్తుంది.

మహేష్, సుకుమార్ కలిసి చేసిన 1 నేనొక్కడినే సినిమా 14 రీల్స్ బ్యానర్ లో నిర్మించగా ఆ సినిమా రిలీజ్ కు ముందే ఈరోస్ సంస్థ కొనేసింది. అయితే సినిమా రిజల్ట్ ప్రకారం ఈరోస్ వారికి ఓ సినిమా చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట మహేష్, సుకుమార్. అందుకే సుకుమార్ ఈ సినిమా పేరుకి మైత్రి బ్యానర్ అని చెబుతున్నా అసలు నిర్మాతలు ఈరోస్ వారే అని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాకు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తాడని టాక్. సుకుమార్ చెప్పిన కథ మహేష్ కు నచ్చలేదట అందుకే ఈరోస్ వారి ప్రమేయంతో విజయేంద్ర ప్రసాద్ కథను మహేష్ తో చేసేలా సుకుమార్ ను ఒప్పించారట. ఈ సినిమా కోసం సుకుమార్ భారీ డీల్ సెట్ చేసుకున్నాడట. మరి రంగస్థలం తర్వాత మహేష్ తో చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.