సలార్ సెకండ్ ట్రైలర్ విడుదల వాయిదా….

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ సలార్. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ యొక్క మానియా రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం ఈ చిత్రం యొక్క రెండవ ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది .అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్ రేపు సాయంత్రానికి వాయిదా పడినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పటికీ పలు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఈ చిత్రమ్ క్రిస్మస్ కానుకగా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి ట్రైలర్ మరియు సాంగ్స్ కి మంచి స్పందన లభిస్తుంది.ఈ చిత్రానికి రవి బసురుర్ సంగీతాన్ని అందిస్తు ఉండగా భువన కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు .హోంబలి ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించుతున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసింది అలాగే కేరళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ,జగపతిబాబు ఈశ్వరి కుమారి , శ్రియా రెడ్డి మొదలైన నటులు కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version